లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్య రెట్టింపు నమోదు అవుతోంది. లాక్ డౌన్ కారణంగా రెగ్యులర్ గా సినిమాలు చూసేవారు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అంతేగాక ఇప్పుడు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు సైతం నాలుగైదు వారాల్లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించారు అనడానికి ఇదో కారణం. ఇక ఓటిటి సినిమాలంటే తెలిసిందేగా.. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, ఆహా, వూట్, సోనీ లివ్, జీ5 లాంటివి.. రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. అయితే.. మామూలుగా ఒక వారంలో ఇరవైకి పైగా సినిమాలు స్ట్రీమింగ్ అవ్వడం చూశాం. కానీ.. ఆగష్టు 12న ఒకేసారి 21 సినిమాలు/వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందులో తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఆగష్టు 12న స్ట్రీమింగ్ కానున్న 21 సినిమాల లిస్ట్ చూద్దాం! ఆహా(Aha): మహా మనిషి మాలిక్ ఏజెంట్ ఆనంద్ సంతోష్(సిరీస్ - ఎపిసోడ్ 4) అమెజాన్ ప్రైమ్(Amazon Prime): మైండ్ ఆఫ్ మల్హోత్రాస్(హిందీ - సిరీస్ 2) లీగ్ ఆఫ్ దెయిర్ ఓన్(ఇంగ్లీష్ - సిరీస్ 1) నెట్ ఫ్లిక్స్(Netflix): శభాష్ మిథు(హిందీ, తెలుగు, తమిళం) నెవర్ హావ్ ఐ ఎవర్(హిందీ, ఇంగ్లీష్ - సిరీస్ 3), ఎ మోడల్ ఫ్యామిలీ(కొరియన్ - సిరీస్ 1) బ్లడ్ షాట్(ఇంగ్లీష్) డే షిఫ్ట్(ఇంగ్లీష్) 13: ది మ్యూజికల్(ఇంగ్లీష్) ది థ్రోన్(ఇంగ్లీష్), ది రాజ్ గాయ్(ఇంగ్లీష్) జీ5(Zee5): కానేయాదవర బగ్గే ప్రకటనే(కన్నడ) హలో వరల్డ్(సిరీస్ 1 - తెలుగు, తమిళ) శ్రీమతి(బెంగాలీ) డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar): కాడవర్(తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ) సోనీ లివ్(Sony LIV): గార్గి (తెలుగు, తమిళ) వూట్(Voot): హరికతే అల్ల గిరికతే(కన్నడ) శభాష్ మిథు(హిందీ, తెలుగు, తమిళం) ఆహా(తమిళం): ఎమోజి(సిరీస్-1) హోయ్ చోయ్(Hoichoi): మర్డర్ బై ది సి(బెంగాలీ) ఇక ఒకేరోజు ఇన్ని సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతుంటే ఓటిటి ప్రేక్షకులకే పండగే అని చెప్పాలి. సినిమాలు/సిరీస్ ల ద్వారా ఆడియెన్స్ కి కావాల్సినంత వినోదాన్ని అందించనున్నాయి ఓటిటి సంస్థలు. మరి ఆగష్టు 12న స్ట్రీమింగ్ కానున్న ఓటిటి సినిమాలు/ సిరీస్ లలో మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. OTT Releases Tomorrow - 12th Aug pic.twitter.com/XsJ8Ovuni6 — Aakashavaani (@TheAakashavaani) August 11, 2022