ప్రతీ వారం థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటిటిలో కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే.. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకంటే ఓటిటిలో ఎక్కువ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయనే సంగతి తెలిసిందే. ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేట్రికల్ సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే.. లాక్ డౌన్ తర్వాత జనాలంతా ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు. ఇక ఇప్పుడు ఓటిటి సినిమాలకు కూడా బాగానే ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు కూడా థియేటర్ లలో విడుదలయ్యే సినిమాలకు తోడుగా ఓటిటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారం రాబోతున్న సినిమాలు చూసినట్లయితే.. 5 సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా, 18 సినిమాలు ఓటిటిలలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వారం అటు థియేట్రికల్ ప్రేక్షకులను, ఓటిటి ప్రేక్షకులను అలరించనున్న సినిమాలేంటో చూద్దాం. ఈ వారం ఓటిటి/థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలేంటంటే! నెట్ ఫ్లిక్స్(Netflix): ఆగష్టు 17 - రాయల్ టీన్ ఆగష్టు 17 – లుక్ బోత్ వేస్ ఆగష్టు 18 – హి మ్యాన్ ఆగష్టు 18 – టేకెన్ బ్లడ్ లైన్ ఆగష్టు 19 – ది నెక్స్ట్ 365 డేస్ ఆగష్టు 19 – ఎకోస్ ఆగష్టు 19 – ది గర్ల్ ఇన్ ది మిర్రర్ ఆగష్టు 20 – యాడ్ ఆస్ట్రా ఆగష్టు 20 - షేర్ దిల్ (హిందీ) ఆగష్టు 20 - ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ ఆహా(Aha): ఆగష్టు 19 – హైవే (తెలుగు) జీ5(Zee5): ఆగష్టు 19 – ఏనుగు (తెలుగు, తమిళం) ఆగష్టు 19 – దురంగ (వెబ్ సిరీస్) సోనీ లివ్(Sony LIV): ఆగష్టు 19 – తమిళ్ రాకర్స్ (వెబ్ సిరీస్) డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar): ఆగష్టు 17 – షి హల్క్ (తెలుగు) ఆగష్టు 19 – హెవెన్ (మలయాళం) ఆగష్టు 22 - ది హౌస్ ఆఫ్ ది డ్రాగన్ (వెబ్ సిరీస్) ఆహా(tamil): ఆగష్టు 19 - జీవి 2 ఇక ఈ వారం(ఆగష్టు 19న) థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు: తీస్ మార్ ఖాన్ వాంటెడ్ పండుగాడ్ మాటరాని మౌనమిది కమిట్మెంట్ అం అః ఈ విధంగా సినీ ప్రేమికులకు, ఓటిటి ప్రేక్షకులకు ఈ వారం పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి వెబ్ సిరీస్/సినిమాలు. ఒకే వారంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది ఫస్ట్ టైమ్ కాదు. మరి పైన పేర్కొన్న 18 ఓటిటి సినిమాలు, 5 థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.