సాధారణంగా కూతురి స్నేహితులను కూడా తమ బిడ్డల్లాగా భావిస్తారు తల్లిదండ్రులు. తమ కూతురి ఫ్రెండ్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే సాయపడుతుంటారు. అయితే ఓ తండ్రి మాత్రం తన కూతురి స్నేహితురాలని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. ఇందుకు ఆ యువతి నిరాకరించడంతో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. తండ్రి చేసిన పనిని తప్పు అని చెప్పాల్సిన కూతురు.. అతడికి వంతపాడింది. తన తండ్రిని పెళ్లిచేసుకోమంటే కాదన్నందుకు బూట్లను నాకించి స్నేహం అనే పదానికి మాయని మచ్చతెచ్చింది ఆ యువతి. ఈ దారుణమైన ఈ ఘటన పాకిస్థాన్ చోటుచేసుకుంది. ఈ ఘటన గత కొన్ని రోజుల క్రితం జరిగినప్పటికి దీనికి సంబంధించిన విషయాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. పాకిస్థాన్ లోని లాహోర్ జిల్లాలోని ఫైసలాబాద్ చెందిన ఖతీజా మహ్మద్ అనే యువతి బీడీఎస్ చివరి ఏడాది చదువుతోంది. ఆమె సోదరులు ఉద్యోగరీత్య యూకే, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తన తల్లితో కలసి ఖతీజా ఉంటుంది. ఈ క్రమంలో తన క్లాస్ మేట్ అయినా అనా అలీ అనే యువతితో తో ఖతీజాకి బంధుత్వం ఉంది. అనా వాళ్ల తండ్రి షేక్ డానిష్ అలీ ప్రముఖ వ్యాపార వేత్త. అప్పుడప్పుడు ఖతీజా తన స్నేహితురాలు అనా ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో ఖతీజా పై షేక్ డానిష్ కన్నుబడింది. కూతురులాగా చూడాల్సిన యువతిపై కామంతో చూశాడు. మనసులోని మాటను కుమార్తెకు చెప్పి..పెళ్లి ప్రతిపాదన చేశాడు. తండ్రి వయసుండే అతడ్ని తాను పెళ్లి చేసుకోవడం ఏంటని? బాధితురాలు నిరాకరించింది. ఇదే విషయాన్ని స్నేహితురాలి ముఖంపై చెప్పడంతో అనా అలీ ఆగ్రహంతో ఊగిపోయింది. అప్పటి నుంచి ఖతీజా.. అనా కుటుంబానికి దూరంగా ఉంటోంది.ఈ క్రమంలో ఆగస్టు 8న యూకేలో నుంచి ఖతీజా సోదరుడు వచ్చాడు. ఈ విషయం తెలిసిన అనా తండ్రి మరోసారి 14 మందితో కలిసి ఖతీజా ఇంటి వెళ్లాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఖతీజా సోదరుడు కూడా నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన డానిష్ వారిపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారిద్దరినీ బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లిన డానిష్.. అక్కడ మరోమారు ఇద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు. I pray the daughters of AAZ, MNS, SS, all CMs, IGs and judicial officers suffer this way because it is under their watch such animal behaviour is getting rampant by the day. It is today that judiciary is becoming callous to the extreme. pic.twitter.com/K7cIYWk7iV — Lt Gen Asif Yasin Malik (@Asifym786) August 17, 2022 ఆపై ఖతీజాకు గుండు కొట్టి, కనుబొమలు గీయించాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖతీజాతో తన కుమార్తె అనా బూట్లను నాకించారు. ఈ ఘటన మొత్తాన్ని అతడి అనుచరులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్పందించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు డానిష్, ఆయన కుమార్తె అనా సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. شیخ دانش اور اسکی بیٹی انا علی کی تصویر ہے جس نے اپنی دوست خدیجہ کو اپنے باپ سے شادی کرنے پر مجبور کیا اور انکار پر تشدد۔ ریپ ۔ جوتے چٹواے پولیس نے جب شیخ دانش کے گھر پر ریڈ کیا تو بھاری مقدار میں شراب اور اسلحہ برآمد ہوا اس لڑکی کو اتنا وائرل کریں جتنا خدیجہ کو کیا گیا ہے pic.twitter.com/5bQHgCqhX4 — Amir Ghazi (@GaziAmirGujar) August 17, 2022 ఇదీ చదవండి: ప్రియుడికి ముద్దుపెట్టి చంపిన ప్రియురాలు.. దిమ్మతిరిగే విషయం ఏంటంటే? ఇదీ చదవండి: ప్రేమించాలని వెంటపడ్డాడు.. కాదనడంతో సైకోగా మారాడు!