హైదరాబాద్- గే పెళ్లి ఇప్పుడు సర్వ సాధారణం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా స్వలింగ సంపర్క జంటలు పెళ్లిల్లు చేసుకుంటున్నాయి. అదేం పెద్ద విషయం, కొత్త అంశం కాదు. కానీ మొట్టమొదటి సారి తెలంగాణలో గే పెళ్లి జరిగింది. అది కూడా హైదరాబాద్ లో గే వివాహం జరగం విశేషం. మరి ఈ వివరాలేంటో తెలుసుకుందామా.. ఇప్పటి వరకు మనం అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవడం మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. మన హైదరాబాద్ లో వీళ్లు పెళ్లిచేసపకోవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణాలో పెళ్లి చేసుకున్న తొలి గే జంటగా వీరు రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో సుప్రియో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అభయ్ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్‌గా ఉన్నాడు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. ఇంకేముంది వారి పెళ్లికి బాజాలు మోగాయి. స్వలింగ సంపర్క పెళ్లి కదా ఎదో సంపుల్ గా అలా కానిచ్చేశారని అనుకుంటే మీరు పొరపాటుపడినట్లే. వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకను సంప్రదాయబద్దంగా జరిపించారు. అంటే పెళ్లి తంతులో భాగమైన మంగళస్నానాలు, సంగీత్ వంటి కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. సుప్రిమో, అభయ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు మధ్య ఇద్దరూ ఒక్కటయ్యారు. బంధు మిత్రులు, అథిధులు నూతన కొత్త జంటను ఆశీర్వదించారు. అదన్నమాట సంగతి.. తెలంగాణలో వివాహ బంధంతో ఒక్కటైన మొదటి జంటగా సుప్రియో, అభయ్ రికార్డుల్లోకెక్కారు.