Viral Video: 12 గంటలు కష్టపడి పనిచేస్తున్న తమకు నాసిరకం భోజనం పెట్టి, కడుపు మాడుస్తున్నారంటూ ఓ కానిస్టేబుల్ నిరసనకు దిగాడు. వెక్కివెక్కి ఏడుస్తూ తన బాధను చెప్పుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఫిరోజాబాద్‌కు చెందిన మనోజ్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా, తమకు పెడుతున్న భోజనంపై అతడు నిరసన వ్యక్తం చేశాడు. నాసిరకం భోజనం పెట్టి కడుపు మాడుస్తున్నారంటూ పబ్లిక్‌గా అధికారులపై మండిపడ్డాడు. మనోజ్ మాట్లాడుతూ.. ‘‘ మేము 12 గంటల పాటు గొడ్డు చాకిరి చేస్తున్నాము. కానీ, మాకు నాసిరకం భోజనం పెడుతున్నారు. నా ప్లేటులో మీరు చూస్తున్న భోజనాన్ని కుక్కలు కూడా తినవు. ఎస్పీ, డీసీపీ కలిసి స్కామ్ చేస్తున్నారు. వారి కారణంగా పోలీసులకు నాసిరకం భోజనం అందుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆథిత్యనాథ్ ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావటం లేదు. సరైన పౌష్టికాహారం అందటం లేదు. డీజీపీకి ఈ విషయమై చాలా సార్లు ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కెప్టెన్ సార్ నా సమస్యలను, ఆర్ఐ సమస్యలను పట్టించుకోవటం లేదు. నేను వెంటనే సస్పెండ్ అవుతానని ఆయన అన్నారు’’ అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. 'Government makes us work for 12-12 hours and gives such food in return' ◆ Manoj Kumar, a constable of UP Police posted at Firozabad Headquarters, narrated his agony with tears.@firozabadpolice @Uppolice #zerodha pic.twitter.com/LLAssKWSMY — jamidarkachora (@jamidarkachora) August 11, 2022 ఇవి కూడా చదవండి : Raksha Bandhan 2022: బంగారం, వజ్రాలతో రాఖీ.. ధర తెలిస్తే మతి పోతుంది!