ప్రభుత్వాలు ఎన్ని రూల్స్ పెట్టినప్పటికీ కొన్ని సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాల్లో తినే వస్తువులు, అమ్మే వస్తువులు అధిక ధరలకు అమ్ముతుంటారు. గత్యంతరం లేక తప్పని సరి పరిస్థితుల్లో జనాలు కొంటుంటారు. కొంత మంది వీటి గురించి ప్రశ్నిస్తే.. ఏం చేస్తారో చేసుకో అన్నట్టు అమ్మేవారు మట్లాడటం చూస్తూనే ఉంటాం. కానీ ఎంఆర్పీ ధరకంటే వ్యాపారి రూ.20 అధికంగా తీసుకోవడంపై ఓ రిటైర్ట్ టీచర్ మూడేళ్ల పాటు న్యాయపోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. ఈ ఘటన మైసూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 2019లో సత్యనారాయణ అనే రిటైర్డు ఉపాధ్యాయుడు హనుమంతరాజు షాపులో 3 శారీ ఫాల్స్‌ను కొన్నాడు. ఒక్కో ఫాల్ రూ.30 చోప్పున మొత్తం రూ.90 అవుతుంది. కానీ ఆ షాపు యజమాని మాత్రం సత్యనారాయణకు రూ.110 బిల్ వేసి వసూలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా సత్యనారాయణకు ఇచ్చాడు షాపు యజమాని. రూ.90 బిల్లుకి రూ.110 ఎలా వసూలు చేస్తారని షాపు యజమానిని ప్రశ్నించగా ఇష్టం వచ్చినట్లు మట్లాడి పంపించాడు. ఇంటికి వచ్చిన సత్యనారాయణ జిల్లా వినియోగదారుల ఫోరంలో వ్యాపారి తన వద్ద అక్రమంగా రూ.20 వసూలు చేశాడని.. ఆ వ్యాపారి ద్వారా తనకు రూ.61 వేల పరిహారాన్ని ఇప్పించాలని కేసు వేశాడు. అంతేకాదు ఈ కేసు విషయమై 3 సంవత్సరాల వరకు న్యాయ పోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. వ్యాపారి చేసింది ముమ్మాటికి తప్పే అని నిర్ధారణ కావడంతో.. ఫోరం ఆ షాపు యజమానికి రూ.6,020 జరిమానా విధిస్తూ, ఆ సొమ్మును బాధితునికి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: అతనికి 75.. ఆమెకు 70! పెళ్లైన 54 ఏళ్ల తర్వాత సంతానం.. ఇది చదవండి: అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. బిత్తరపోయిన ఖాతాదారుడు!