మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టు అయిన సంగతి తెలిసిందే. ఆ కేసుతో సంబంధం ఉన్న బెర్నార్డ్ ను తాజాగా ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేశారు. ఆయన ఫార్మ్‌హౌజ్‌లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. యూపీలో అరెస్టు అయిన బెర్నార్డ్‌ను తీసుకువచ్చేందుకు తమ బృందం వెళ్తున్నట్లు వెస్ట్ గారో హిల్స్ ఎస్పీ వివేకానంద సింగ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ గారోహిల్స్ జిల్లాలోతురా పట్టణంలో ఉన్న బెర్నార్డ్ మరక్‌కు చెందిన రింపు బగన్ అనే ఫాంహౌజ్ ఉంది. తన ఫాంహౌసులో గుట్టుగా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఫాంహౌస్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 27 వాహనాలు, 400 మద్యం బాటిళ్లు, 500కు పైగా కండోమ్‌లు,47 మొబైల్ ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యభిచార దందాతో సంబంధం ఉన్న 73 మంది అరెస్ట్ చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. ముగ్గురు చిన్నారు కూడా ఉన్నారు. రక్షించిన చిన్నారులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని ఎస్పీ తెలిపారు. దీంతో మరాక్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన కోసం పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలించారు. బెర్నార్డ్ కోసం మేఘాలయా పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. తుర కోర్టు బెర్నార్డ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చివరకు యూపీలో ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే తాను అమాయకుడినని, సీఎం కాన్రాడ్ సంగ్మా రాజకీయ కుట్రతో తనను ఇరికించినట్లు బెర్నార్డ్ ఆరోపించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #Meghalaya Sex Racket Case: BJP Leader, Accused Of Running Brothel, Arrested In UP Know more: https://t.co/dnJMQAdVl6 pic.twitter.com/TKunXoheC0 — ABP LIVE (@abplive) July 26, 2022 ఇదీ చదవండి: ఆర్మీ జవాన్‌ను ట్రాప్ చేసింది! తీరా ఆమె ఎవరో తెలిసి..! ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆమె మంత్రి గారికి క్లోజ్! హీరోయిన్స్ ను మించే అందం! కానీ.., ఏకంగా 20 కోట్లు!