ఈ మద్య కేంద్రంలో అధికార పార్టీపై సొంత పార్టీ నేతల సెటైర్లు మొదలయ్యాయి. అధికార పార్టీలో ఉన్న కొంత మంది నేతలు ప్రత్యర్థులపైనే కాదు.. తన సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. అలాంటి వారిలో ముఖ్యులు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై సుబ్రహ్మణ్య స్వామి ఆమెకు కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో ద్రవ్యోల్భణంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా దేశ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదని.. కానీ దీనిపై ప్రతిపక్ష నేతలు తమకు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇక భారత్ లో మాంద్యం వచ్చే ప్రసక్తే లేదని.. అదే విధంగా తన ప్రసంగంలో అమెరికా దేశ ప్రస్థావన కూడా తీసుకు వచ్చారు. ఇదిలా ఉంటే.. నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చేసిన ప్రకటనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కౌంటర్ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మాంద్యంపై మాట్లాడటాన్ని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ట్విట్ కూడా చేశారు. నిర్మలమ్మ చెప్పింది నిజమే..ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది క్రితమే మాంద్యంలోకి జారుకుందని, ఇప్పుడు కొత్తగా మాంద్యం వస్తుందనటం అవివేకమంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై పొలిటికల్ రచ్చతో పాటు, ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. “No question of the Indian economy getting into recession” says Finance Minister according to media today. She is right!! Because Indian economy has already got into recession last year. So question of getting into recession does not arise. — Subramanian Swamy (@Swamy39) August 2, 2022 ఇది చదవండి: ‘ఇస్రో’ కీలక నిర్ణయం.. రాకెట్ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూసే అవకాశం! ఇది చదవండి: కారు కొని బ్లెసింగ్స్ అడిగిన కస్టమర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర!