ఈ మద్య కొంత మంది తాము ఎంతో ఆశపడే వాహనాలు కొనుగోలు చేయడానికి ఎప్పటి నుంచో చిల్లర జమచేస్తూ.. షోరూం లోకి వెళ్లి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే కస్టమర్ తీసుకు వచ్చిన చిల్లర నాణేలు లెక్కబెట్టడానికి షోరూం సిబ్బంది పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఒక వ్యక్తి ఆరేళ్లుగా చిల్లర నాణేలు జమ రూ.1.8 లక్షలు కూడబెట్టి షోరూం కి వెళ్లి వాహనం కొనుగోలు చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుబ్రతా సర్కార్ అనే వ్యక్తి గత కొంత కాలంగా బీడీలు తయారు చేసి పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులకు అమ్ముతుంటాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని నెలల పాటు నగదు కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పుడు ఎక్కువగా చిల్లర లావాదేవీలు జరిగాయి. ఇక బీడీలు అమ్మగా వచ్చిన చిల్లర మొత్తం కొన్ని బస్తాల్లో నింపిపెట్టాడు సుబ్రత. అయితే ఆ చిల్లర మూటల్లో ఎక్కువగా రెండు రూపాయిల నాణేలు ఉన్నాయి. అలా కూడబెట్టిన చిల్లర మొత్తం రూ.1.8 లక్షలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సుబ్రతా సర్కార్ ఒక బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. మొత్తానికి పదివేల చొప్పున బస్తాల్లో నింపుకొని బైక్ షోరూం కి తన కొడుకుతో వెళ్లాడు సుబ్రతా సర్కార్. తాను కొనుగొలు చేయబోయే బైక్ కోసం 2 రూపాయాల నాణేలను షోరూం మేనేజర్ అందజేశాడు. ఆ చిల్లర పైసల బస్తాలు చూసి షోరూం సిబ్బంది షాకయ్యారు. చిల్లర మొత్తం లెక్క పెట్టడానికి బాగానే టైమ్ తీసుకుందని షోరూం మేనేజర్ తెలిపారు. తర్వతా సుబ్రతా సర్కార్ కొడకు శేఖర్‌కు బైక్ కీ, పత్రాలు అందజేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన బైకర్..! చివరలో అద్భుతం! Over six years following demonetisation in November 2016, a trader in #WestBengal saved coins worth ₹1.8 lakh in two sacks He used the savings to buy a motorbike.https://t.co/Kask1RDzbO — Hindustan Times (@htTweets) July 15, 2022