ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా యుగం. ఏం చేసినా సరే.. నిమిషాల వ్యవధిలో ప్రపంచం అంతా తెలుస్తుంది. రాత్రికి రాత్రే స్టార్ కావాలన్నా.. సెలబ్రిటీ కావాలన్నా సోషల్ మీడియాతోనే సాధ్యం. అంతగా అది మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే వెంటనే వైరలవుతోంది. అభిమానులకు-సెలబ్రిటీలకు మధ్య వారధిగా మారింది సోషల్ మీడియా. అందుకే సామాన్యులు ఎలా ఉన్న సరే.. సెలబ్రిటీలు మాత్రం.. బహిరంగ ప్రదేశాల్లో, మీడియా సమావేశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే దారుణమైన ఫలితాలు చవి చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలయ్యింది. ఆ వివరాలు.. ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి దాయాదుల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ టి20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన ఉత్కంఠ పోరుటో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. ఈ మ్యాచ్ను చూసేందుకు సెలబ్రిటీలే కాక చాలా మంది అభిమానులు దుబాయ్ వెళ్లారు. వీరిలో అమిత్ షా కుమారుడు జై షా కూడా ఉన్నాడు. ఇక పాక్పై గెలుపు అనంతరం స్టేడియంలో ఉన్న భారతీయ అభిమానులు ఆనందోత్సాహాల మధ్య చప్పట్లు కొడుతూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయా జెండాను పట్టుకుని అభివాదం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి జై షాకు జాతీయ జెండా తీసుకెళ్లి ఇవ్వగా అతడు దాన్ని పట్టుకోవడానికి నిరాకరించాడు. నో చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజనులు.. మొన్నటి వరకు హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి భారతీయుడు ఇంటి మీద జెండాను ఎగురవేసి దేశంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేంద్ర మంత్రి కుమారుడివైన నువ్వు.. జెండా పట్టుకోవడానికి నిరాకరించావు.. ఇదేనా నీ దేశభక్తి.. సంస్కారం అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Did Jay Shah just refuse to hold our national flag! pic.twitter.com/7TzE74zNlD — Alind Chauhan (@alindchauhan) August 28, 2022 ఇది కూడా చదవండి: భారత్- పాక్ మ్యాచ్ చూస్తే రూ. 5000 జరిమానా! ఇది కూడా చదవండి: ‘డీఆర్ఎస్ తీసుకున్నా, అక్కడ నాటౌట్ అయినా నేను ఒప్పుకోను’: థర్డ్ అంపైర్!