దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహేంద్ర ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంటారు. ప్రపంచంలో ఎన్నో అద్బుతాలు, వింతలూ విశేషాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారు. ఆయన ఎంతో మంది ఔత్సాహికులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంటారు. తాజాగా ఆయన ఓ విచిత్రమైన స్కూటర్ కి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చాలా మంది తమ పాత వాహనాలను సెకండ్ సేల్ చేయడమో.. స్క్రాప్ కి ఇచ్చివేయడమో చేస్తుంటారు. ఓ వ్యక్తి తన పాత స్కూటర్ ని తన అభిరుచికి తగ్గట్టుగా రీమోడలింగ్ చేపించుకున్నాడు. ఆ పాత స్కూటర్ ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడంతో పాటూ చుట్టూ దానికి రంగు రంగు లైట్లు, డిజిలట్ వాచ్, స్పీకర్లు కూడా అమర్చాడు. అయితే తాను రీ మోడలింగ్ చేసిన స్కూటర్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 60 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని యజమాని తెలిపాడు. ఒక్కసారి దీనికి చార్జింగ్ పెడితే దాదాపు 90 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవొచ్చిన ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఆనంద్ మహేంద్ర దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్టర్ లో ‘మీరు ఎంతో ఎంటర్ టైన్ చేస్తారు.. మీరు కోరుకున్న జీవితం లభిస్తుంది’ అంటూ దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Life can be as colourful and entertaining as you want it to be… #OnlyInIndia pic.twitter.com/hAmmfye0Fo — anand mahindra (@anandmahindra) June 17, 2022