Viral Video: పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అని పెద్దలు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. అసలు వీళ్లిద్దరూ జోడీనా? అని మనం నోరెళ్లబెట్టేలా కొన్ని జంటలు ఉంటాయి. ఆ జంటల్ని చూస్తే మతి పోతుంది. ఒక్కో సారి కాకి ముక్కుకు దొండపండు అనిపిస్తుంటుంది. తాజాగా, తమిళనాడులో ఓ పెళ్లి.. ఆ పెళ్లి చేసుకున్న జంట నెట్టింట వైరల్‌గా మారింది. ఆ జంటను చూస్తున్న 90 కిడ్స్ ఆవేదనతో అల్లాడుతున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. తమిళనాడుకు చెందిన ఓ 61 ఏళ్ల వృద్ధుడు ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం పుదుచ్చేరిలోని బంధువులను చూడటానికి తమిళనాడు వచ్చాడు. ఈ సందర్బంగా తాను ఒంటరిగా ఉంటూ ఇబ్బందులు పడుతున్నానని, ఓ తోడు కావాలని వారితో చెప్పాడు. దీంతో బంధువులు అతడికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పుదుచ్చేరిలో నివాసం ఉంటున్న ఓ 28 ఏళ్ల అమ్మాయి వృద్ధుడ్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది. తాజాగా, వీరిద్దరి పెళ్లి ‘మనక్కుల వినాయగర్’ గుడిలో తక్కువ మంది బంధువుల మధ్య జరిగిపోయింది. కొన్ని రోజులు పుదుచ్చేరిలో ఉన్న తర్వాత ఈ కొత్త జంట ఫ్రాన్స్‌కు వెళ్లిపోయేందుకు చూస్తోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఈ జంట వయసు విషయంలో సందిగ్ధం నెలకొంది. కొంతమంది 75 వెడ్స్ 28 అని అంటుంటే.. 41 ఏళ్ల మహిళ తన భర్త చనిపోవటంతో వృద్ధుడిని పెళ్లి చేసుకుందని మరికొందరు అంటున్నారు. పెళ్లి కోసం వరుడు, వధువు కుటుంబానికి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. அந்த பொண்ணோட அம்மாவுக்கும் இந்த மாப்பிள்ளைக்கும் ஒரே வயசா இருக்கும்னு நினைக்கிறேன் ..ennatha சொல்ல ...கிரகம் https://t.co/g5TiOE5xE0 — Dr.Siva Shankar S B.Tech.,M.Tech.,Ph.D.,(PDF) (@SivaShankarSub2) August 30, 2022 ఇవి కూడా చదవండి : ప్రియుడితో లేచిపోయిన భార్య.. ఫోటోతో పిచ్చోడిలా వెతుకుతున్న భర్త!