అంగవైకల్యం శాపం అన్న భావనను వీడి మనోధైర్యమే బాసటగా కొంతమంది విజయశిఖరాలను అధిరోహిస్తున్నారు. సాధారణంగా అన్ని అవయవాలు సరిగా ఉండి అత్తెసరు మార్కులతో పాస్ అయితే చాలు అనుకునేవారు ఎంతో మంద ఉంటారు. కానీ దృష్టి లోపం ఉన్నా అందరి దృష్టీ తనపై ఉండేలా సత్తా చాటింది ఓ అమ్మాయి. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని నిరూపించింది. కేరళలోని కొచ్చికి చెందిన 19 ఏళ్ల హన్నా అలిస్ సైమన్ CBSE 12వ బోర్డు పరీక్షల్లో వికలాంగుల విభాగంలో 500 మార్కులకు 496తో అగ్రస్థానంలో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రానికి చెందిన హన్నా ఆలిస్ సిమోన్ అనే బాలికకు పుట్టుకతోనే మైక్రోఫ్తాల్మియా ఉంది. ఈ పరిస్థితి ఆమెకు అంధత్వానికి దారితీసింది. స్కూల్ చదివే సమయంలో ఆమెను తోటి పిల్లలెందరో హేళన చేసేవారు. కానీ.. హన్నా ఏనాడు తాను అంధురాలిని అని బాధపడలేదు.. తన వైకల్యాన్ని అధిగమించాలనే ధృడ సంకల్పంతో.. చదువులోనే కాదు వివిధ రంగాల్లో తన ప్రతిభ చాటుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే కృషి చేసింది. హన్నా.. సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్గా, యూ ట్యూబర్ గా, మోటివేషన్ స్పీకర్ గా 19 ఏళ్లలోపుగానే రాణించసాగింది. ఆయా రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇటీవలే సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో హన్నా సిమోన్ 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించి, టాపర్ గా నిలిచింది. అమెరికాలో సైకాలజీ చదివేందుకు పూర్తి స్కాలర్ షిప్పునకు ఎంపికై విశేష ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా హన్నా మాట్లాడుతూ.. ‘అందరికీ.. ధన్యవాదాలు.. నిజంగా ఇది ఎంతో సంతోషకరమైన విషయం... 500కి 496 స్కోర్ చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని.. వాటిని ఎదిరించి పోరాడాలని నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. నా తల్లిదండ్రులు నన్ను వేరేలా చూడకూడదని భావించారు, కాబట్టి వారు నన్ను బ్లైండ్ స్కూల్‌లో చేర్చలేదు. బదులుగా, వారు నన్ను రెగ్యులర్ స్కూల్‌లో చేర్చారు. మొదట్లో కష్టమే అనిపించినా.. ఎప్పుడూ బాధగా ఫీల్ కాలేదు.. నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి, నా ప్రణాళికలను నమ్ముతాను.’ అని హన్నా చెప్పింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Kochi, Kerala | Hannah Simon, a YouTuber, singer & motivational speaker, suffering from Microphthalmia (birth defect resulting in blindness for her) topped CBSE Class XII in category of students with disabilities— scoring 496 out of 500 She says, "Really happy & grateful to God" pic.twitter.com/TopuyXqE6m — ANI (@ANI) July 25, 2022 ఇది చదవండి: వీడియో: నీటిలో మునిగిపోయిన బాలుడు.. ప్రాణాలు కాపాడిన డ్రోన్ ఇది చదవండి: వీడియో: తరగతి గదిలో విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న టీచరమ్మ!