నేటికాలంలో ఉద్యోగానికి ఉన్న పోటీ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క జాబ్ సంపాదించేందుకు యువత నానా తంటాలు పడుతుంది. చాలా కష్టపడి ఓ ఉద్యోగం సాధిస్తే.. అందులో జాగ్రత్తగా పని చేసుకుంటారు. తొందరపడి ఇంకో జాబ్ కి మారరు. ఎవరో కొందరు మాత్రమే కంపెనీలు, జాబ్ లో మారుతుంటారు. అయితే అందరికి భిన్నంగా ఓ యువతి..23 ఏళ్లలో 23 జాబ్ లు చేసి..మానేసింది. అయితే ఆమె పర్ఫామెన్స్ బాగాలేక కంపెనీలే తొలగించాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆ యువతి నెంబర్ వన్ టాలెంట్.. పని చేసిన ప్రతి చోట మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఆ యువతి ఎందుకు జాబ్ లు మానేస్తుంది? ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో ఉంది? ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంగ్లాండ్ లోని లండన్ కి చెందిన అనస్తాసియా సెటెట్టోకి 23 ఏళ్లు. ఆమెకు చిన్నతనం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. అలా పెరుగుతూ అతి చిన్న వయసులోనే అనేక రంగాల్లో జాబ్ చేసి.. తన ట్యాలెంట్ ను ఫ్రూవ్ చేసుకుంది. ఒక ఉద్యోగం చేస్తునే ప్రతి సారి దానికన్నా ఇంక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండేది. అలా కేవలం 23 ఏళ్ల వయస్సులోనే 23 ఉద్యోగాలు చేసి మానేసింది. పనిచేసిన అన్నిచోట్ల తనకంటూ మంచి గుర్తింపును సంపాదించింది. ఆమె రష్యా, ఇటాలియన్, ఇంగ్లీష్, డచ్ అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. అయితే ఇంత టాలెంట్ ఉన్న ఈమె తన కెరీర్ ను మాత్రం బేకరి ఉద్యోగంతో ప్రారంభించింది. View this post on Instagram A post shared by Anastasia Cecchetto✨Fashion London (@anastasia_cecchetto) అనంతరం డిష్ వాషర్, వెయిటర్, క్యాషియర్, సేల్స్ వర్కర్, పియానో టీచర్, మార్కెట్ సెల్లర్, నటన, మోడలింగ్ రంగాలలో పనిచేసింది. అంతేకాకుండా. అనువాదకురాలిగా, కంటెంట్ రైటర్ గా, SEO నిపుణురాలిగా, సోషల్ మీడియా మెనేజర్‌గా, లగ్జరీ క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిరంగాల్లో తనదైన ముద్రవేసింది అనస్తాసియా. జీరో నుంచి హీరో అవడం అంటే ఇదేనేమో! అన్ని ఉద్యోగాలలో పనిచేసి చాలా అనుభవం సంపాదించింది. ప్రస్తుతం సొంతంగా మార్కెటింగ్ ఏజెన్సీ స్థాపించి దానికి సీఈవో అయ్యింది. View this post on Instagram A post shared by Anastasia Cecchetto✨Fashion London (@anastasia_cecchetto) ప్రస్తుతం అనస్తాసియా సెచెట్టో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అతిచిన్న వయస్సులు అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆ యువతిని చూసి నెజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. బేకరిలో పనిచేసే స్థాయి నుంచి ఓ కంపెనీ స్థాపించి, దానికి సీఈవో గా ఎదిగిన ఈ 23 ఏళ్ల యువతి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.