అమెరికాలోని కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేసే సమయంలో రెండు మినీ విమానాలు ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సయంలో విమానాలు 200మీ. ఎత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్యపై మాత్రం స్పష్టత రాలేదు. వాట్సోన్‌విల్లే నగరంలోని ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలు ఒకే సమయంలో ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం ట్విన్ ఇంజిన్ సెస్నా 340, సింగిల్ ఇంజిన్ సెస్నా 153 విమానాలు ఢీ కొట్టుకున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటన గురువారం (ఆగస్టు 18) మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా వాట్సన్‌విల్లే ఎయిర్‌పోర్ట్‌కు కంట్రోల్ టవర్ లేకపోవడం.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఎయిర్‌పోర్టును రీక్రియేషనల్ ప్లేన్స్, అగ్రికల్చర్ వ్యాపారాల కోసం వాడుతారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫెడరల్ ఏవియేషన్ ప్రకారం.. ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానంలో ఇద్దరు, సింగిల్ ఇంజిన్ సెస్నా152 విమానంలో పైలట్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. Multiple agencies responded to Watsonville Municipal Airport after 2 planes attempting to land collided. We have reports of multiple fatalities. Report came in at 2:56pm. Investigation is underway, updates to follow. pic.twitter.com/pltHIAyw5p — City of Watsonville (@WatsonvilleCity) August 18, 2022 ఇది చదవండి: డిగ్రీ చదువుతున్న అనూష.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి! ఇది చదవండి: దారుణం.. భార్యపై కోపంతో పిల్లల గొంతు కోసేశాడు!