వందలు, వేల కోట్లు సంపాదించే వారు కోట్లలో పన్నులు కడుతుంటారు. కొందరు మాత్రం పన్నులు ఎగ్గొడుతుంటారు. అలాంటి వారిలో ప్రముఖ పాప్ సింగర్ షకీరా ఒకరు. తన పాటలతో యావత్తు వరల్డ్ యూత్‌ను ఒక ఊపు ఊపేసిన ఈ పాప్ సింగర్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. వందల కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిందని, స్పెయిన్ ప్రభుత్వానికి భారీగా పన్ను బాకీ ఉందని ఆరోపణలు ఎదుర్కుంటుంది. 2012-2014 మధ్య కాలంలో షకీరా చెల్లించాల్సిన 14.7 మిలియన్ డాలర్ల పన్ను విషయంలో ప్రస్తుతం వివాదం నడుస్తోంది. మిలియన్ డాలర్ల పన్ను ఎగ్గొట్టిందంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న షకీరా.. అధికారులకి సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఆమె కావాలనే పన్ను చెల్లించలేదని అధికారులు అంటున్నారు. ఈ విషయంపై బార్సిలోనా ప్రాసిక్యూటర్లు ఆమెను హెచ్చరించినా పట్టించుకోవడం లేదట. ఇక విసిగిపోయిన అధికారులు ఆమెను విచారించేందుకు సిద్ధమయ్యారట. ఈ విచారణలో షకీరా నేరం రుజువైతే కనీసం 8 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, 23 మిలియన్ డాలర్ల జరిమానా కూడా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. కొలంబియాకు చెందిన ఈ పాప్ సింగర్.. 2000 నుండి 2010 వరకు 'ఆంటోనియో డిల రువా' అనే లాయర్‌తో రిలేషన్ షిప్‌లో ఉంది. అయితే వాకా వాకా సాంగ్ ప్రమోషన్ సమయంలో స్పెయిన్‌కు చెందిన ఫుట్ క్రీడాకారుడు గెరార్డ్ పీకేతో ప్రేమలో పడింది. 2011 నుండి ఈ ఇద్దరూ తమ రిలేషన్ షిప్‌ను కొనసాగిస్తున్నారు. పెళ్ళి అనే పదానికి షకీరా దూరంగా ఉంటుంది. కలిసి ఉంటున్నాంగా, మధ్యలో పేపర్లు ఎందుకని ఆమె అభిప్రాయం. అందుకే పెళ్ళి కాన్సెప్ట్ లేకుండా ఫుట్‌బాల్ ప్లేయర్ గెరార్డ్‌తోనే రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. గెరార్డ్ ఆమె కన్నా 10 ఏళ్లు చిన్నవాడయినప్పటికీ అతనితోనే కలిసి ఉంటుంది. స్పెయిన్‌లో స్థిరపడిన ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తున్న షకీరా .. 2014 వరకు టాక్స్ చెల్లింపు మాత్రం బహమాస్‌లో కొనసాగించింది. ఆ తర్వాత 2015లో షకీరా పూర్తిగా స్పెయిన్ దేశానికి మకాం మార్చినట్టు ఆమె తరపు న్యాయవాది చెబుతున్న మాట. పన్ను బకాయి విషయంలో షకీరాను తప్పు పట్టలేమనేది సదరు లాయర్ వాదన. ఇదిలా ఉంటే 11 ఏళ్ల తర్వాత మేం విడిపోతున్నామని షకీరా, గెరార్డ్ ప్రకటించి షాక్ ఇచ్చారు. పన్ను ఎగవేత వివాదాన్ని డైవర్ట్ చేసేందుకే ఆమె ఈ ప్రకటన చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ పాప్ సింగర్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కట్టి తోప్ సింగర్ అనిపించుకుంటుందా? లేదా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Allu Arjun: చెవి పోగులు, సైడ్ కటింగ్స్.. ఊరమాస్ లుక్‌లో బన్నీ! ఇది కూడా చదవండి: స్టార్ హీరో సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు దుర్మరణం