చైనా ఇటీవల స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం కావాల్సిన ల్యాబరేటరీ మాడ్యూల్ ని.. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాకెట్ బూస్టర్ సరైన విధంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదు. దాంతో పెద్దే సమస్యే నెలకొంది. ఎక్కడ పడుతుంది.. ఎంత ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుందో అని అంతా కంగారు పడ్డారు. అయితే అది ఎలాంటి ప్రమాదం తలపెట్టకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. చైనా రాకెట్ శకలాలు హిందూ మహా సముద్రంలో పడినట్లు అమెరికా సైతం ధ్రువీకరించింది. హిందూ మహా సముద్రంలోని బోర్నియో ద్వీపం, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతంలో భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ సమయంలో బూస్టర్ విడిపోయి శిథిలాలుగా కాలిపోయింది. గతంలోనూ చైనా ఇలాగే రెండుసార్లు రాకెట్ బూస్టర్ల రీఎంట్రీని సరైన మార్గంలో చేయలేదు. అవికూడా ఎలాంటి కంట్రోల్ లేకుండా భూ వాతావరణంలోకి వచ్చాయి. The People’s Republic of China did not share specific trajectory information as their Long March 5B rocket fell back to Earth. All spacefaring nations should follow established best practices, and do their part to share this type of information in advance to allow… — Bill Nelson (@SenBillNelson) July 30, 2022 చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నిల్సన్ తప్పుబట్టారు. తమ రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోవడంలో చైనా పదే పదే విఫలమవుతోందంటూ విమర్శించారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు మరింత అత్యుత్తమ విధానాలను అవలంభించాలని సూచించారు. ఈ శకలాలను ఉల్కాపాతంగా భావించిన ప్రజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. చైనా రాకెట్ శకలాలు సముద్రంలో పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. meteor spotted in kuching! #jalanbako 31/7/2022 pic.twitter.com/ff8b2zI2sw — Nazri sulaiman (@nazriacai) July 30, 2022 #USSPACECOM can confirm the People’s Republic of China (PRC) Long March 5B (CZ-5B) re-entered over the Indian Ocean at approx 10:45 am MDT on 7/30. We refer you to the #PRC for further details on the reentry’s technical aspects such as potential debris dispersal+ impact location. — U.S. Space Command (@US_SpaceCom) July 30, 2022 ఇదీ చదవండి: ఉద్యోగులకు బోనస్‌గా ఊహించని గిఫ్ట్ ఇచ్చిన లేడీ బాస్! దేవత సామీ ఈ బాస్! ఇదీ చదవండి: వంద కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిన ప్రముఖ సింగర్.. 8 ఏళ్ళ జైలు శిక్ష?