సాధారణంగా కొన్నిదేశాల్లో చోర్ బజార్ లు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి దొంగిలించిన వస్తువులను తీసుకొచ్చి అక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఇలా చేయడానికి చాలా ముఠాలే పనిచేస్తుంటాయి. ఇది మనకు చిన్న వ్యాపారంగానే కనిపించవచ్చు. కానీ ఇది ఇంటర్నేషనల్ గా జరిగే వాహన విక్రయ మాఫియాతో ముడిపడిన వ్యవహారం. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈ వ్యవహారం అంతా బయటపడుతుంది. అయితే ఈ క్రమంలోనే లండన్ కు చెందిన అత్యంత ఖరీదైన బెంట్లీ కారు చోరీకి గురైంది. దానిని పాకిస్థాన్ లో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మరి లండన్ లో దొంగిలించబడ్డ కారు పాక్ లోకి ఎలా వచ్చింది? మరి ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. బెంట్లీ మల్సాన్ వీటీ.. ఆటోమేటిక్ కారు. ప్రపంచంలోనే అరుదైన అలాగే ఖరీదైన కార్లలో ఒకటిగా పేరుగాంచింది బెంట్లీ కారు. మరి అలాంటి కారు అంతర్జాతీయ దొంగల కంట పడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా అందుకే తమ చేతివాటం చూపించారు. లండన్ లో బెంట్లీ కారును దొంగింలిచి దాన్ని పాకిస్థాన్ లోని కరాచీకి చేరవేశారు. అయితే ఈ కారు కోసం కస్టమ్స్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కారు ఆగష్టు 30 కరాచీలోని ఓ ఇంటి ముందు ఉన్నట్లు విదేశీ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సమాచారం పాక్ కస్టమ్స్ అధికారులకు అందింది. సమాచారం తెలియడంతో వెంటనే కస్టమ్స్ అధికారులు ఆ ఇంటి పై దాడి చేసి ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. కారుకు స్థానిక నెంబర్ ప్లేట్ ఉండటం గమనార్హం. ఈ కారు కొన్న యజమాని మాట్లాడుతూ.." ఈ కారును అమ్మిన వ్యక్తి నాకు 2022 నవంబర్ కల్లా కారుకు సంబంధించిన అన్నిపత్రాలు ఇస్తానని చెప్పాడు. ఇక ఈ కారుకు తాళాలు లేకపోవడంతో క్యారియర్ వాహనంతో దిన్నీ ఇంటికి తరలించినట్టు పేర్కొన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే? కారుకు సరైన పత్రాలు లేకపోయినప్పటికీ సింధ్ ప్రాంతంలో ఇది రిజిస్టర్ అయ్యినట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఛాసిస్ నెంబర్, కారు ఛాసిస్ నెంబర్ ఒక్కటే అని అధికారులు ధ్రువీకరించారు. అయితే ఒక విదేశీ కారు మరో దేశంలో రిజిస్ట్రేషన్ కావాలంటే సవాలక్ష తనిఖీలు, పరీక్షలు, పత్రాలు చూడాలి. మరి అలాంటిది ఈ బెంట్లీ కారుకు రిజిస్ట్రేషన్ చేశారు అంటే తప్పు జరిందని అని అధికారులు గుర్తించారు. ఇక ఈ విషయంపై పాక్ వీల్స్ సహ యజమాని సునీల్ ముంజ్ మట్లాడుతూ.. " ఇలా కార్లను దొంగలించడానికి కొన్ని ముఠాలు పని చేస్తాయి. వాటిని జాగ్రత్తగా గమ్యాలకు చేర్చిన తర్వాతే దొంగలించిన ప్రాంతంలో కేసు నమోదు అయ్యేలా చూస్తారు. అయితే ఈ కారు మాత్రం కస్టమ్స్ అధికారులకు తెలియకుండా రాలేదు. కారుకు సంబంధించిన అన్నిఎంబసీ పత్రాలు క్లియర్ గా ఉన్నాయి. అయితే ఇలాంటి కార్లను దౌత్య వేత్తలు డ్యూటి రవాణాకు ఉపయోగిస్తారు. వీరి పేర్లు చెప్పుకునే ఇవి ఇతర దేశాలకు వస్తూంటాయి. బెంట్లీ ధర పాక్ లో రూ. 4.14 కోట్లకు పైగా ఉంటుదని" సునీల్ తెలిపాడు. అయితే టాక్స్ లు, విదేశీ సుంకం లాంటి వాటిని కలిపితే పాకిస్థాన్ లో బెంట్లీ ధర రూ. 30 కోట్లకు పైగానే ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి లండన్ నుంచి బెంట్లీ పాకిస్థాన్ కు చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Custom raided a house in DHA #Karachi to recover grey Bentley Mulsanne, V8 which was allegedly stolen from #London. #theCivileyes pic.twitter.com/SsFrGeJtVG — TheCivilEyes (@TheCivilEyes) September 3, 2022 ఇదీ చదవండి: వీడియో: హీరో విజయ్ ని మించిపోయేలా డ్యాన్స్ చేసిన బుడ్డోడు! ఇదీ చదవండి: నిద్ర పోటీల్లో గెలిచిన యువతి.. ఏకంగా రూ.5 లక్షలు గెలుచుకుంది!