Director Bobby: ప్రముఖ దర్శకుడు బాబి అలియాస్ కొల్లి రవీంద్ర ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కొల్లి మోహన రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు 69 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. గుంటూరులోని ఆయన స్వగ్రామం నాగారంపాలెంలో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. బాబి తండ్రి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కాగా, బాబి 2003లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ దగ్గర పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకులు దశరథ్, గోపిచంద్ మలినేని దగ్గర కూడా పనిచేశారు. 2014లో మాస్ మహరాజా రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో దర్శకుడిగా మారారు. 2016లో పవన్ కల్యాణ్‌తో సర్థార్ గబ్బర్‌సింగ్ చేశారు. జూ. ఎన్టీఆర్ ‘జై లవకుశ’తో 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా చేస్తున్నారు. ఇవి కూడా చదవండి : అందమైన ప్రేమ కావ్యం.. సీతారామంపై మెగాస్టార్ ప్రశంసలు!