సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో, ఛాలెంజింగ్ రోల్స్ తో తన సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో తానేంటో నిరూపించుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా అలాంటి బోల్డ్ రోల్స్ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను సైతం లైనప్ చేసి పెట్టుకుంది. అయితే.. త్వరలోనే సమంత ఓ స్టార్ హీరోకి విలన్ గా కనిపించనుందట. ఇంతకీ ఆ హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్. అవును.. మాస్టర్ సినిమాతో దళపతి విజయ్ - డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. లోకేష్ తో తన 67వ సినిమా చేయనున్నాడు విజయ్. ఈ సినిమాలో ఆసక్తికరమైన విలన్ రోల్ పోషించనుందట సమంత. మరి ఈ వార్తలు సినీ వర్గాలలో అయితే వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ‘పుష్ఫ’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది సమంత. అటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ డోస్ ఉన్న పాత్రలు చేసేందుకు కూడా సై అంటోందని టాక్. అయితే.. గతంలో విజయ్, సమంత కలిసి జంటగా 3 సినిమాలలో నటించారు. ఇప్పుడే అదే విజయ్ కి సమంత విలన్ అనేసరికి న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ తో “విక్రమ్” తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్.. తన తదుపరి చిత్రాన్ని తమిళ సూపర్ స్టార్ విజయ్ తో చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను ఎంపిక అయ్యిందని.. విలన్ పాత్రకు సమంత నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి విజయ్ సినిమాలో సమంత విలన్ రోల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Vijay vs Samantha Face-off #Thalapathy67 @actorvijay #Varisu pic.twitter.com/yv0jhmzXaj — ☃️ ℳsd பிசாசு (@Star_Vijay7) July 19, 2022