ఓ వారం రోజుల నుంచి సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్‌లో ఓ జంట పెళ్లి వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. వారే సీరియల్ నటి, వీజే మహాలక్ష్మి, తమిళ్ నిర్మాత రవిందర్ చంద్రశేఖర్ పెళ్లి వార్త, ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక ఈ మధ్య కాలంలో ఈ జంట ఎదుర్కొన్నంత బాడీ షేమింగ్ ఇంక ఎవరు ఫేస్ చేసి ఉండరేమో. చాలా మంది డబ్బుకు ఆశపడి మహాలక్ష్మి ఈ వివాహం చేసుకుందని ట్రోల్ చేశారు. ఈ అంశంపై రవీందర్ చాలా పాజిటీవ్‌గా స్పందించారు. తాము కూడా అలాంటి వీడియోలు, వార్తలు చదివామని.. కానీ ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. తమది ప్రేమ వివాహం అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంటకు సంబంధించి మరో వార్త నెట్టింట జోరుగా ప్రచారం అవుతోంది. అదేంటంటే పిల్లల విషయంలో మహాలక్ష్మి, రవీందర్‌కు ఓ కండిషన్ పెట్టారని.. అందుకు ఆయన కూడా అంగీకరించారని ఆ వార్తల సారాంశం. ఆ వివరాలు.. మహాలక్ష్మి-రవీందర్‌లు ఇద్దరికి ఇది రెండో వివాహమే. దానికి ముందు మహాలక్ష్మి మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని వేరుగా ఉండేది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. రవీందర్ కూడా మొదటి భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి.. వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే అత్యంత సమీప బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వీరు ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రవీందర్.. పెళ్లికి ముందు మహాలక్ష్మి తనకు పెట్టిన కండీషన్ గురించి వివరించాడు. పిల్లల విషయంలో మహాలక్ష్మి తనకు ఓ షరతు పెట్టిందని చెప్పుకొచ్చాడు. అదేంటంటే.. మహాలక్ష్మికి ఆల్రెడీ ఒక కుమారుడు ఉన్నాడు. కానీ ఆమె మళ్లీ పిల్లల్ని కంటాను అన్నదని.. అందుకు తను కూడా ఓకే చెప్పానని చెప్పుకొచ్చాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: నిర్మాతను పెళ్ళాడిన సీరియల్ నటి.. ఇద్దరికి రెండో వివాహమే! ఇది కూడా చదవండి: ఘనంగా సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్..