విజయ్ సేతుపతి.. అవమానాలు పొందిన దగ్గరే టాప్ హీరోగా ఎదిగాడు. ‘నీ మొఖానికి హీరో అవుతావా అని ఎగతాళి చేసిన వాళ్లే.. సార్ అనే పిలిచే స్థాయికి ఎదిగాడు’. చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి తన నటనతో ఇప్పుడు అగ్ర హీరోల సరసన చేరాడు విజయ్ సేతుపతి. టాలెంట్ ఉంటే అందం, ఆహార్యంతో అవసరం లేదని నిరూపించిన వ్యక్తి విజయ్ సేతుపతి. సైరా నరసింహారెడ్డి, ఉప్పెన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. అయితే విజయ్ సేతుపతి వ్యక్తిత్వం కూడా ఎంతో గొప్పది అని అందరికీ తెలుసు. విజయ్ సేతుపతి.. జీరో నుంచి హీరోగా ఎదిగిన వ్యక్తి కావడంతో అందరికీ ఎంతో మర్యాదిస్తాడని చెబుతుంటారు. దళపతి విజయ్ సైతం సేతుపతి గురించి ఎంతో గొప్పగా చెప్తుంటాడు. వ్యక్తిత్వం పరంగా కూడా సేతుపతికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎదిగినా ఒదిగే ఉండాలి అని నమ్మే విజయ్ సేతుపతి అని సినిమా వర్గాలు చెబుతుంటాయి. View this post on Instagram A post shared by (@vijaysethupathi_kutty_) తాజాగా విజయ్ సేతుపతి, నయనతార భర్త విఘ్నేష్ శివన్ కలిసున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ సేతుపతి ఇటీవల నయనతార, సమంత హీరోయిన్లుగా విఘ్నేష్ దర్శకత్వంలో కణ్మణి- రాంబో- కతీజా అనే సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో సెట్ లోని ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని విజయ్ సేతుపతి ఆటపట్టిస్తున్న ఫొటో అది. సెట్ లో విజయ్ సేతుపతి ఇంత సరదాగా ఉంటాడా అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) విజయ్ సేతుపతి ఒక్క నటుడు మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్లేబాక్ సింగర్, ప్రొడ్యూసర్ కూడా. ఇంక సినిమాల విషయానికి వస్తే.. మా మనితన్ అనే తమిళ్ సినిమా జూన్ 23న విడుదల కానుంది. హిందీ, మలయాళంలో మరో ఐదు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వైరల్ అవుతున్న విజయ్ సేతుపతి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by (@vijaysethupathi_kutty_)