విజయ్ దేవరకొండ.. గత కొద్దిరోజులుగా మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పేరు. ఆగస్టు 25న ఈ రౌడీ హీరో నటించిన లైగర్ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైన విషయం తెలసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్‌లో పనిగట్టుకుని బాయ్‌కాట్ ట్రెండ్ కూడా చేశారు. సినిమా విడుదల తర్వాత మిక్స్ డ్ టాక్‌తో కొనసాగుతోంది. అయితే జరిగిన ప్రచారాలు, వచ్చిన టాక్‌కి సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద లైగర్ సినిమా కలెక్షన్స్ రాబడుతోంది. నిజానికి ఈ మూవీ ఇంకా ఎక్కువే కలెక్ట్ చేసుండాలని ట్రేడ్ పండితులు భావిస్తున్నా కూడా రెండ్రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ మరీ తీసేసేవి మాత్రం కావు. వరల్డ్ వైడ్‌గా రెండ్రోజుల్లో డీసెంట్ నంబర్లే రావడంపై క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. అయితే భాష, ప్రాంతాల వారీగా రెండ్రోజుల్లో లైగర్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. లైగర్ మూవీ రెండ్రోజుల కలెక్షన్స్ గ్రాస్: నైజాం - రూ.9 కోట్లు సీడెడ్ - రూ. 2 కోట్లు వైజాగ్ - 1.47 కోట్లు(షేర్) ఈస్ట్ - రూ.0.74 కోట్లు(షేర్) వెస్ట్ - రూ.0.47 కోట్లు(షేర్) కృష్ణా - రూ.0.55 కోట్లు(షేర్) గుంటూరు - రూ.0.89కోట్లు(షేర్) నెల్లూరు - రూ.0.46 కోట్లు(షేర్) ఆంధ్రా రెండ్రోజుల టోటల్ గ్రాస్ - రూ.7.2 హిందీ బెల్ట్ - రూ.6.5 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.4.2 కోట్లు యూఎస్‌ఏ - రూ.5.3 కోట్లు రెండ్రోజుల్లో లైగర్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ - రూ.34.4 కోట్లు రెండ్రోజుల్లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా రూ.17.5 కోట్ల షేర్ రాబట్టింది. అంటే ట్రేడ్ నిపుణల లెక్కల ప్రకారం ఇది చాలా మంచి కలెక్షన్స్ అనేచెప్పాలి. అయితే ఈ సినిమా కూడా స్లోగా ఎక్కుతుంది.. బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎలాగైతే విజయ్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారో.. అదే జరుగుతోందంటూ కామెంట్ చేస్తున్నారు. లైగర్ సినిమా రెండ్రోజుల కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: విజయ్- అనసూయ మధ్య గొడవకి కారణం ఏమిటి? ఎక్కడ చెడింది? ఇదీ చదవండి: RRRలో పులి సీన్ మేకింగ్ వీడియో వైరల్! జక్కన్న డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!