ప్రస్తుతం దేశవ్యాప్తంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు మారుమోగిపోతుంది. లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే దేశమంతా చుట్టేసి వచ్చింది. ప్రస్తుతం పలు నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో లైగర్‌పై భారీ ఎత్తున ట్రోలింగ్.. అదే సమయంలో పాజిటివ్ ప్రచారం జరుగుతుంది. బాయ్‌కాట్ లైగర్ ట్రెండింగ్‌లోకి రాగా.. విజయ్ ఫ్యాన్స్ ఐ సపోర్ట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం గుంటూరులో లైగర్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుక మీద మాట్లాడుతూ.. విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తనకు 60 ఏళ్లు వచ్చినా సరే.. ఆ 20 రోజులను మాత్రం మర్చిపోలేనంటున్నాడు. ఇంతకు ఏ 20 రోజులు.. ఏంటా కథా తెలియాలంటే.. లైగర్ ప్రమోషన్స్ సందర్భంగా చిత్ర బృందం గుంటూరులో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నాకు అరవై ఏళ్లు వచ్చి, సినిమాలు మానేసి ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా ‘లైగర్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న 20రోజులు.. ఆ సమయంలో మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానాలను మాత్రం మరచిపోలేను. దాని గురించే ఆలోచిస్తుంటాను. మీరు నాకు అంత బలమైన, మధురమైన జ్ఞాపకాలు ఇచ్చారు. తిరిగి మీకు కూడా అంతే అందమైన బహుమతి ఇవ్వడం నా బాధ్యత. మీకు అందరికి గుర్తుండిపోయే సినిమా ‘లైగర్’. ఈ సినిమాకి మూడేళ్లు పట్టింది. థియేటర్లలో ఈ సినిమా కుమ్మేస్తుంది. ఆగస్టు 25న గుంటూరుని మీరుషేక్ చేయాలి’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ‘లైగర్’ ప్రీ రిలీజ్‌కి వచ్చామా.. లేక ఏకంగా సక్సెస్ మీట్‌కి వచ్చామా అనే అనుమానం కలుగుతుంది. మీరందరూ ఒక్కొక్క టిక్కెట్ కొంటే చాలు మా సినిమా బ్లాక్‌బస్టర్. ఈ సినిమాలో విజయ్ ఇరగదీశాడు.. అనన్య చింపేసింది. రమ్యకృష్ణ ఉతికి ఆరేసింది. ఈ సినిమాలో హైలైట్ మైక్ టైసన్. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.. అసలు ఎంత వసూలు చేస్తుందో తెలియదు. కానీ వాటి గురించి ఏం ఆలోచించకుండా.. వాటిని పక్కకు పెట్టి.. ఇంతకంటే డబుల్ బడ్జెట్‌తో విజయ్‌తో ‘జనగణమణ’ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాం.. అది మా నమ్మకం’’ అన్నారు పూరి జగన్నాథ్. మరి విజయ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: బాయ్‌కాట్ లైగర్ ట్రెండ్‌పై విజయ్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎదురొస్తే కొట్లాడటమే! ఇది కూడా చదవండి: లైగర్ సినిమాకు బాయ్‌కాట్ సెగ.. అసలు కారణాలు ఏంటంటే?