ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో అధినేత మనవరాలు అనే గుర్తింపులు అన్నీ పక్కకు నెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సమాజంపై ఆమెకున్న బాధ్యత, సామాజిక స్పృహను ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ప్రజారోగ్యంపై నిత్యం చైతన్య పరుస్తూనే ఉంటారు. ఇక తమ ఫ్యామిలీ విషయాలు, డైలీ యాక్టివిటీస్ మొత్తం సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఉపాసన కొణిదెల ఓ వీడియో అభిమానులతో పంచుకున్నారు. అదేంటంటే.. మెగా కోడలు కొత్తగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆవిడ కొన్న కొత్త లగ్జరీ కారు ఆడీ కంపెనీకి చెందిన ఇ-ట్రోన్. ఆ కారు ఫీచర్స్ తెలియజేస్తూ ఓ షార్ట్ వీడియో ఒకటి చేశారు. ఉపాసన కొణిదెల కొనుగోలు చేసిన ఆడీ ఇ-ట్రోన్ కారు రెడ్ కలర్ లో స్టన్నింగ్ లుక్స్ తో అదిరిపోయింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) వీడియో పోస్ట్ చేస్తూ.. ‘నా దృష్టిలో భవిష్యత్ అంటే స్థిరత్వంతో పాటు ప్రగతిశీలతతో కూడిన ఆడంబరమైన జీవితం. నేను తీసుకున్న ఈ ఆడీ ఇ-ట్రోన్ కారు నాకు ఆ రెండింటిని కలిగి ఉంది. ఇది అన్ని సౌకర్యాలతో కూడినదే కాకుండా ఎంతో సురక్షితమైంది కూడా. నా అన్న ప్రయాణాల్లో నాకు ఎంతో కమ్మకమైన తోడు అని చెప్పవచ్చు’ అంటూ పోస్ట్ చేశారు. ఇంక కారు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారు ఈ కారు 5 సీటర్ 4 డోర్ కూప్ మోడల్. ఈ కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలీమీటర్లు డ్రైవ్ చేయచ్చని చెబుతున్నారు. దీని ధర రూ.1.20 కోట్ల నుంచి రూ.1.80 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఆవిడ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో, ఆడీ ఇండియా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో మాత్రం పెయిడ్ పార్ట్నర్షిప్ అని ఉండటం గమనార్హం. ఉపాసన కొణిదెల కొనుగోలు చేసిన లగ్జరీ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Audi India (@audiin) ఇదీ చదవండి: కామెడీ షోలో హీరోయిన్ హెబ్బా పటేల్ రచ్చ! ఎవరినీ వదల్లేదు.. ఇదీ చదవండి: న్యూస్ రీడర్వి.. ఆ మాత్రం తెలియదా.. శివజ్యోతిని ఆడుకుంటున్న నెటిజనులు!