గీతూ రాయల్, గలాటా గీతూ పేరు ఏదైనా ఈమె మాత్రం స్క్రీన్ మీదకు వచ్చిందంటే రచ్చ రచ్చే. చిత్తూరు యాసతో డైలాగులు ఇరగదీస్తూ ఉంటుంది. బిగ్ బాస్ క్రిటిక్‌గా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు జబర్దస్త్‌లో ఇరగదీస్తోంది. అయితే తాజాగా ఓ వీడియోలో తాను చిన్నప్పటి నుంచి నచ్చినట్లు ఉండలేకపోయానంటూ చెప్పుకుంటూ ఏడ్చేసింది. “నేను నా శరీర ఆకృతి వల్ల నాకు నచ్చిన కాస్టూమ్స్ వేసుకోలేక పోయాను. ఎప్పుడూ ఫుల్ కవర్ అయ్యేవే వేసుకున్నాను. ఎప్పుడూ రివీల్ అయ్యే డ్రెస్సులు వేసుకోలేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు కూడా చున్నీ వేసుకో, కవర్ చేసుకో, కోట్ వేసుకో అంటూ చెబుతూ ఉండేవారు. నేను నా బాడీ విషయంలో ఎంతో బాధ పడ్డాను. జబర్దస్త్ లోనూ ఫుల్ కవర్ ఉండే డ్రెస్సులే వేసుకున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by (@geeturoyal_) “అయితే రీసెంట్గా నా కజిన్స్, ఫ్రెండ్స్ తో మాట్లాడాను. వాళ్లంతా ముందు నీ బాడీని నువ్వు ప్రేమించు అని చెప్పారు. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ అని చెప్పారు. నాకు తెలిసిన ఒక డాక్టర్ కూడా గీతూ అంటే యు ఆర్ వాట్ యు ఆర్ అంటూ చెప్పారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఎవరైనా ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఎవరు ఏమనుకుంటారో అని భయపడకండి” అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by (@geeturoyal_) అయితే ఈ విషయంలో ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. షణ్ను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు బాడీ షేమింగ్ చేశావు. ఇప్పుడు నువ్వు బాడీ షేమింగ్ చేశారంటూ బాధపడుతున్నావు. అప్పుడు నీకు బాధ లేదు కానీ, నీ విషయం వచ్చే సరికి బాధ పుడుతోందా? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై గీతూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by (@geeturoyal_) “నేను బిగ్ బాస్ క్రిటిక్‌గా ప్రతి విషయాన్ని మాట్లాడాను. అతను ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే నేను మాట్లాడాను. క్రిటిక్‌గా అది నా డ్యూటీ. అతను బయటకు వచ్చాక నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అతని పర్సనల్ లైఫ్ నాకు అవసరం లేదు. ఎప్పుడో విషయాలను పట్టుకుని అప్డేట్ కాకుండా ఉండేవాళ్లని నిబ్బాస్ అంటారు. అయినా నిజంగానే నేను బాడీ షేమింగ్ చేసిన వీడియో ఉంటే పంపండి. నేను నా ఇన్ స్టాగ్రామ్‌లో ఓపెన్‌గా సారీ చెప్తాను” అంటూ గీతా రాయల్ క్లారిటీ ఇచ్చింది. గీతూ రాయల్ vs షణ్ను ఫ్యాన్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో విశాల్! ఇదీ చదవండి: మహిళలకు సినిమా రంగంలో గౌరవం లేదు.. తమన్నా ఆవేదన!