‘బంగారం.. చాలామంది అడుగుతున్నారు.. నీ బంగారం ఎవరని.. ఏమని సమాధానం చెప్పను. నువ్వు దూరమయ్యావని చెప్పనా.. నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పనా’.. ఈ డైలాగ్ వినగానే మీకు అర్థమైపోయిందనుకుంటా.. ఎవరి గురించి చెబుతున్నామో.. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న బంగారం గురించే.. ఆమె ఇప్పుడు ఓ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో తెలియదు. అలా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పర్సన్ బంగారం. జస్ట్ ఒక్క ఇన్ స్టా రీల్ తో ఆమె ఫేమస్ అయిపోయింది. ఏడుస్తూ.. బంగారం బంగారం.. ఛీ పోరా అని ఆమె అనడం ఏమో గానీ.. పలువురు యూజర్స్.. ఇదే వీడియోపై చాలా రీల్స్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్నవాళ్లని ఎప్పటికప్పుడు స్టేజీపైకి తీసుకొచ్చే జబర్దస్త్ షో వాళ్లు.. ఇప్పుడు బంగారాన్ని కూడా షోకి తీసుకొచ్చారు. View this post on Instagram A post shared by shanti_ actor's (@pspk_fan_comedy_star_shanti) ఆమె స్టేజీపై ఉన్న ఫొటోలు.. హైపర్ ఆది, జడ్జి ఇంద్రజ, చలాకీ చంటీ లాంటి వాళ్లతో తీసుకున్న ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా త్వరలో స్టార్టయ్యే బిగ్ బాస్ ఆరో సీజన్ లో అడుగుపెట్టబోతున్న చలాకీ చంటికి.. గ్రాండ్ గా ఫేర్ వెల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లోనే చంటి టీమ్ లో బంగారం ఫెర్ఫార్మ్ చేసింది. View this post on Instagram A post shared by shanti_ actor's (@pspk_fan_comedy_star_shanti) జబర్దస్త్ లో బంగారం ఫేమ్ యువతికి సంబంధించిన ప్రాక్టీసు వీడియోలు కూడా యూట్యూబ్ లో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఇంతలా సెన్సేషన్ సృష్టించిన బంగారం.. మరి జబర్దస్త్ స్టేజీపై ఎలా అలరిస్తుందో చూడాలి. మరి మీలో బంగారం రీల్స్ చూసి నవ్వుకున్న వాళ్లు ఎంతమంది? ఆమె జబర్దస్త్ షోలోకి ఎంట్రీ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: ‘ఆంటీ అన్నందుకు సారీ అను’.. నెటిజన్ క్షమాపణలకు అనసూయ రిప్లై ఏంటంటే? ఇదీ చదవండి: వీడియో: తనని తిట్టిన థియేటర్ ఓనర్ ని కలిసిన విజయ్ దేవరకొండ!