తెలుగు బుల్లి తెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అనేక సినిమాలో విభిన్నమైన పాత్రల్లో అనసూయ నటించి.. మెప్పించింది. అయితే గత రెండు రోజుల నుంచి అనసూయ వర్సెస్ ఓ హీరో అభిమానుల మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమెను ఎవరైన అసభ్య పదజాలంతో దూషిస్తూ పెట్టిన ట్వీట్స్ కి ఆమె రీట్వీట్ చేస్తూ వారి కౌంటర్ ఇస్తుంది. దీంతో కొంతమంది భయపడి ట్వీట్స్ డిలీట్ చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం వెనక్కి తగ్గడం కుండా అనసూయని ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు అయితే 'ఆంటీ' అనే పదాన్ని హ్యాష్ ట్యాగ్‌గా క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై అనసూయ సీరియస్ అయింది. తాజాగా ఈ విషయంపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. గురువారం ఓ యంగ్ హీరో సినిమా రిలీజైంది. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నెగిటీవ్ టాక్ వచ్చింది. ఈక్రమంలోనే అనసూయ ఓ ట్వీట్ చేసింది. "అమ్మను అంటే ఆ ఉసురు ఊరికే పోదు" అంటూ అనసూయ పరోక్షంగా ట్వీట్ చేసింది. దీంతో అనసూయ ట్వీట్ పై ఆ యంగ్ హీరో ఫ్యాన్స్ భగ్గమన్నారు. మాటలతో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో కొందరు అనసూయను "ఆంటీ" అని కూడా సంబోధించారు. తనను ఆంటీ అంటూ టార్గెట్ చేస్తున్నారని, అటు వంటి వారిపై కేసు పెడతానని చెప్పింది. దీంతో మరింత రెచ్చిపోయినా కొందరు.. ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్రెండ్ చేయటం ప్రారంభించారు. అతే అనుసూయ ఏమాత్రం తగ్గకుండా..వారికి గట్టి కౌంటర్లు ఇస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంటీ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాగా.. ఈ విషయంపై అనసూయ శనివారం సాయంత్రం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనుందని టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఫిర్యాదు చేస్తుందా.. చేస్తే మీడియాతో ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Now I am depressed #Aunty pic.twitter.com/ekBFtau0qw — kurrodukakinada (@kurradukakinada) August 26, 2022 ఇదీ చదవండి: అనసూయకి సపోర్ట్ చేస్తే నన్నెందుకు ట్రోల్ చేస్తున్నారు?: శ్రద్ధాదాస్ ఇదీ చదవండి: వర్జినిటీపై ప్రశ్నకు ఘాటుగా జవాబిచ్చిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి!