The Warrior: తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రామ్ పోతినేని. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే ‘రెడ్’ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా, ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామితో ‘ ది వారియర్’ సినిమా చేశాడు. ఆ సినిమా జులై 14న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక, ‘ది వారియర్’ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుందన్న సంగతి తెలిసింది. ఇందుకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఆగస్టు 11నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇవి కూడా చదవండి : Kalyan Dev: చాలా రోజుల తర్వాత కూతురితో కల్యాణ్ దేవ్.. వీడియో వైరల్!