టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ అంటే పూరి జగన్నాథ్ అని అంటుంటారు. ఎందుకంటే.. ఆయన సినిమాలలో హీరోల క్యారెక్టర్స్, యాటిట్యూడ్ అంత స్పెషల్ గా ఉంటాయి. ఒక్కో హీరోకి తన మార్క్ క్యారెక్టరైజేషన్, మేనరిజమ్ జోడించి బ్లాక్ బస్టర్స్ అందుకోవడమే కాకుండా.. తన సినిమాలలో నటించిన హీరోలందరికీ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అయితే.. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' మూవీ తెరకెక్కించాడు పూరి. ఈ సినిమా ఆగష్టు 25న రిలీజ్ అవుతుండగా.. ప్రమోషన్స్ లో భాగంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు పూరి. ఇక ఇంటర్వ్యూలో భాగంగా లైగర్ సినిమా విషయాలు చర్చించిన సుకుమార్.. పూరి జగన్నాథ్ ఇప్పటివరకూ రూపొందించిన హీరోల క్యారెక్టర్స్, యాటిట్యూడ్, మేనరిజమ్ గురించి టాపిక్ లేవనెత్తాడు. అందులోనూ తాను అల్లు అర్జున్ తో తీస్తున్న పుష్ప క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ పూరినే అని చెప్పి సర్ప్రైజ్ చేశాడు సుక్కు. సాధారణంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తాను సినిమాలు తీసిన హీరోలందరికీ ఒక్కో యాటిట్యూడ్ క్రియేట్ చేసి హిట్స్ కొట్టాడు. అప్పటినుండి పూరి సినిమాలలో హీరోల క్యారెక్టర్స్ చూసి.. మిగతా దర్శకులంతా ఇన్స్పైర్ అవుతుంటారు. తాజాగా సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో హీరో క్యారెక్టర్ యాటిట్యూడ్ కి మీరే ఇన్స్పిరేషన్ అని పూరితో చెప్పారు. ప్రస్తుతం వీరి ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. మరి పుష్ప యాటిట్యూడ్ కి పూరి ఇన్స్పిరేషన్ అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.