దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అద్భుత కావ్యం 'సీతారామం'. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ తర్వాత జనాలు లేక అల్లాడుతున్న థియేటర్స్‌కి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన సినిమాల్లో సీతారామం కూడా ఒకటి. దుల్కర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా థియేటర్‌కి రప్పించింది, మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు ఇంత బాగా కనెక్ట్ అయిన సీతారామం సినిమాకి ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం కనెక్ట్ కాలేకపోయారట. ఈ సినిమా మొదట దుల్కర్ దగ్గరకి వెళ్ళలేదట. మొదట ఈ కథ ముగ్గురు హీరోల దగ్గరకు వెళ్ళిందట. హను రాఘవపూడి మొదట ఈ స్క్రిప్ట్‌ను నానికి వినిపించారట. అయితే లై, పడిపడి లేచే మనసు సినిమాలతో ఫ్లాపులతో ఉన్న హనుని నమ్మి సినిమా చేయడం రిస్క్ అని వదులుకున్నారట. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్‌ను ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి వినిపించారట. కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ సీన్స్ లేవని తిరస్కరించారట. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు ఈ కథ వినిపించారని, అయితే ఆ కథ విజయ్‌కి పెద్దగా నచ్చలేదని, అందుకే రిజక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా దుల్కర్ సల్మాన్‌కి కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం, ఇవాళ సినిమా పెద్ద హిట్ అవ్వడం జరిగాయి. కానీ అనవసరంగా మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారే అని ఆ ముగ్గురు హీరోల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఈ హీరోలు సీతారామం కథను వదులుకున్నారా? దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: హీరో వెంకటేష్ కుటుంబానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట! ఇది కూడా చదవండి: Madhavan: ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్‌కి కారణం చెప్పిన మాధవన్..