బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ జీవితంలోని మధుర క్షణాలను ఆశ్వాదిస్తోంది. తన అభిమానులతో ఓ శుభవరాత్ను పంచుకుంది. ఆగస్టు 20న తాను ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. వైద్యులు, నర్సులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ థాంక్యూ నోట్ రాసుకొచ్చింది. “ఆగస్టు 20, 2022 రోజున ముద్దులొలికే బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. వైద్యులు, నర్సులు, కుటుంబసభ్యులు, మిత్రులు.. నా ఈ ప్రయాణంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రారంభం మాత్రమే, బాబు రాకతో మా జీవితాలే మారిపోతున్నాయనే విషయం మాకు తెలుసు” అంటూ సోనమ్ కపూర్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) సోనమ్ కపూర్‌కు 2018లో ఆనంద్ అహుజాతో వివాహం జరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో తాను గర్భవతిని అంటూ ప్రకటించింది. ఆ తర్వాత బేబీ బంప్‌తో ఫొటో షూట్స్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకంది. ప్రస్తుతం సోనమ్ కపూర్ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ గా మారింది. సినీ తారలు, సెలబ్రిటీలు, అభిమానులు, సినిమా ప్రేక్షకులు అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి.. కామెంట్స్ రూపంలో మీరూ సోనమ్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలియజేయండి. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) ఇదీ చదవండి: ‘కార్తికేయ 2’కి దిల్ రాజు భయపడ్డాడు.. పనికిమాలిన సినిమా అనుకుంటే ఆగమనడుగా: తమ్మారెడ్డి ఇదీ చదవండి: లైగర్ సినిమాకు బాయ్‌కాట్ సెగ.. అసలు కారణాలు ఏంటంటే?