Sobhita Dhulipala: సినీ ఇండస్ట్రీలో ఏదైనా స్టార్ కపుల్ విడాకులు తీసుకొని ఎవరి కెరీర్ వైపు వాళ్ళు దృష్టిపెట్టి వెళ్తున్నప్పుడు రూమర్స్ రావడం అనేది సర్వసాధారణం. అయితే.. విడిపోయిన వారిని వేరే వాళ్ళతో డేటింగ్, లవ్ అంటూ ముడిపెడుతూ ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. ఆ వార్తలపై సంబంధిత స్టార్స్ కూడా స్పందించాలని లేదు. ఒకవేళ స్పందించకపోతే అవి రూమర్స్ గానే మిగిలిపోతాయని కూడా చెప్పవచ్చు. ఒక హీరోయిన్ తో విడాకులు తీసుకున్న హీరో.. కొత్తమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడని రూమర్స్ వస్తే.. వాటిని హీరో లైట్ తీసుకోవచ్చు. కానీ.. సదరు కొత్త హీరోయిన్ రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుందని.. రూమర్స్ విషయంలో స్పందిస్తుంటారు. ఈ టాపిక్ ఎవరి గురించి అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య - సమంత విడాకులు తీసుకుని ఎవరి కెరీర్ పై వారు ఫోకస్ పెట్టి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. అవి సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. కానీ.. ఈ విషయంపై ఇప్పటివరకూ అటు నాగచైతన్య, ఇటు శోభిత ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా శోభిత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వేలు (మిడిల్ ఫింగర్) చూపిస్తూ వీడియో పెట్టింది. అయితే.. శోభిత పెట్టిన ఆ వీడియో.. నాగచైతన్యతో డేటింగ్ అంటూ పుకార్లు సృష్టించిన వారిని ఉద్దేశించే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. నిజానికి శోభిత ఆ వీడియో ఎందుకు పెట్టిందో గానీ.. నెటిజెన్స్ మాత్రం రూమర్స్ గురించే అని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల మేజర్ సినిమాతో సక్సెస్ అందుకున్న శోభిత.. ది గ్రేట్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పొన్నియన్ సెల్వన్'లో నటిస్తోంది. ఇక నాగచైతన్య త్వరలో థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి శోభిత పెట్టిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. To everyone who made a mess A reply can't better than this pic.twitter.com/alHr0qb0gV — Arisetty Prasad (@PrasadAGVR) June 24, 2022