చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు పాతనీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. దీన్ని ఎవరైనా స్వాగతించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఎప్పుడూ కోరుకునేది కొత్తదనాన్నే. కొత్త హీరోలు, కొత్త ఆర్టిస్టులు, హీరోయిన్లు.. చివరిగా కొత్త కంటెంట్ ఉన్న సినిమాలు.. ఇవేగా ప్రేక్షకులు కోరేది. అయితే.. సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఎప్పుడు ఏ రంగు హైలైట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కొందరు హీరోయిన్ల ఎంట్రీలు కొత్త పెయింటింగ్ లా అనిపిస్తుంటాయి. వాళ్ల పెర్ఫార్మన్సులు ఆకట్టుకుంటాయి. అంతెందుకు ఓ రకంగా కొత్త హీరోయిన్ల పర్సనాలిటీలు సైతం మనల్ని ఆకర్షణకు గురి చేస్తాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ గురించే చర్చలు జరుగుతున్నాయి. రెగ్యులర్ గా రెండుమూడు సినిమాలతో కాకుండా మొదటి సినిమాకే సూపర్ క్రేజ్ దక్కించుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. ప్రస్తుతం 'సీతారామం' సినిమాతో తెలుగులో డెబ్యూ చేసిన మృణాల్ ఠాకూర్.. ఆ కోవకే చెందుతుందని చెప్పాలి. దర్శకుడు హను రాఘవపూడి ఓ ప్రేమకావ్యంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ సీత పాత్రలో నటించింది. దుల్కర్ సల్మాన్ ఇందులో రామ్ పాత్రలో నటించాడు. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న సీతారామం మూవీ చూసినవారంతా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాత్రను, ఆమె నటనను ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నారు. ఎంతో చక్కగా ఆమె తన పాత్రకు న్యాయం చేసిందని కొనియాడుతున్నారు. మరి ఒక కొత్త హీరోయిన్ని ఇంతలా ప్రేక్షకులు కొనియాడుతున్నారంటే.. ఎవరీ మృణాల్ ఠాకూర్? ఎక్కడినుండి వచ్చింది? అసలు ఆమె సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలపై ఆరా తీయడం ప్రారంభించారు సినిమా లవర్స్. మహారాష్ట్రలోని ధూలే ఏరియాలో పుట్టిన మృణాల్ ఠాకూర్.. ముంబైలోనే తన స్కూలింగ్, కాలేజీ పూర్తిచేసింది. మాస్ మీడియాలో కోర్స్ చేసిన మృణాల్.. 2012లో 'ముజ్ సే కుచ్ కెహెతి.. యే కామోషీయన్' అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2014లో 'కుంకుమ్ భాగ్య' సీరియల్ తో మంచి గుర్తింపు దక్కించుకుని, తన మొదటి సినిమా వట్టిదండు(మరాఠీ)తో సినీ నటిగా అరంగేట్రం చేసింది. అలా 2018లో 'లవ్ సోనియా' అనే సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ చేసింది మృణాల్. డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ.. హృతిక్ రోషన్ సరసన సూపర్ 30, జాన్ అబ్రహం సరసం బట్లహౌస్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఆ విధంగా వరుస సినిమాలైతే చేస్తోంది. కానీ.. హీరోయిన్ గా తగిన గుర్తింపు తెచ్చే పాత్రలు పడలేదు. ఇక ఎట్టకేలకు తెలుగులో 'సీతారామం' సినిమాలో అవకాశం అందుకొని, సీత పాత్రలో తన నటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సీతారామం మూవీ.. అన్నిచోట్లా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. సీతగా అందరి మనసులను హత్తుకునే నటన కనబర్చి హృదయాలను గెలిచింది. టీవీ సీరియల్ ఆర్టిస్ట్ దగ్గరనుండి మొదలైన మృణాల్ నట ప్రస్థానం.. ఇప్పుడు ఆమెను స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేర్చిందనే చెప్పాలి. టాలీవుడ్ కి మరో మంచి నటి దొరికిందనే నమ్మకాన్ని కలిగించింది. ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందాలనే వారందరికీ.. మృణాల్ లైఫ్ స్టోరీ ఆదర్శంగా నిలుస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఫ్యూచర్ లో మరిన్ని తెలుగు సినిమాలతో మెప్పిస్తుందేమో చూడాలి. మృణాల్ లైఫ్ స్టోరీపై, సీతారామం సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur)