Shilpa Shetty: సినిమా షూటింగుల్లో ప్రమాదాలు జరగటం అన్నది సర్వసాధారణం. చిన్న చిన్న సీన్లలో కూడా నటీనటులు ప్రమాదాల బారినపడుతుంటారు. తాజాగా, శిల్పా శెట్టి కూడా సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. డైరెక్టర్ రోల్ కెమెరా, యాక్షన్ ‘ కాలు విరగొట్టుకోవాలి’ అనగానే.. నిజంగానే ఆమె తన కాలును విరగొట్టుకున్నారు. అంటే ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని కూడా శిల్పా శెట్టి జోక్ లాగా చెప్పారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బుధవారం కాలుకు కట్టుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘‘రోల్ కెమెరా, యాక్షన్ ‘కాలు విరగొట్టుకో’ అని వాళ్లు చెప్పారు. నేను నిజంగానే విరగొట్టుకున్నాను. ఇప్పుడు 6 వారాల పాటు యాక్షన్‌లో ఉండలేని పరిస్థితి. కానీ, అతి త్వరలో మరింత శక్తివంతంగా తిరిగివస్తాను. అప్పటి వరకు మీ ప్రార్థనల్లో నన్ను గుర్తుంచుకోండి. ప్రార్థనలు నిజంగా పని చేస్తాయి. మీ శిల్పా శెట్టి కుంద్రా’’ అని రాసుకొచ్చారు. కాగా, శిల్పా శెట్టి ప్రస్తుతం రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌కు సంబంధించిన బిహైండ్‌ది సెట్స్ వీడియోను మంగళవారం విడుదల చేసింది. యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన ఆ వీడియోలో ఫైట్ ఇరగదీశారామె. మరి, శిల్పా శెట్టి కాలు గాయం నుంచి త్వరగా బయట పడాలని కోరుకుంటూ మీ ప్రార్థనలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఇవి కూడా చదవండి : వీడియో: కార్తిక దీపం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ వస్తున్న దీప!