చలన చిత్ర పరిశ్రమలో సినీ తారలది ప్రత్యేకమైన జీవన విధానం. వారు ఒక్కరే ప్రశాంతంగా ఎక్కడికై వెళ్తే చాలు అభిమానులు ఫొటోల కోసం ఎగబడతారు. దాంతో వారు ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికే బాడీ గార్డు లను నియమించుకుంటారు. అదీ కాక అప్పుడప్పుడు తారలకు బెదిరింపు కాల్స్ సైతం వస్తూఉంటాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరోకు 'నిన్ను చంపుతాం' అని లేఖ రావడం కలకలం సృష్టించింది. దాంతో ఆ హీరోకి గన్ లైసెన్స్ ను తీసుకున్నాడు. బెదిరింపులు వచ్చిన ఆ హీరో ఎవరు? లాంటి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ కండల వీరుడిగా అందరికి తెలుసు. తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డ్ లు బద్దలు కొడుతూ ఉంటాడు. అయితే సల్మాన్ ఖాన్ లైసెన్స్ ఉన్న గన్ను తీసుకున్నవార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో గత నెల జూన్ 6వ తారిఖున సల్మాన్ ఇంటి ముందు ఒక వాహనం అనుమానాస్పందంగా తిరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అదీ కాక 'పంజాబ్ సింగర్ మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుందని' ఓ ఉత్తరం సల్మాన్ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ జులై 22న పోలీసు స్టేషన్ కు వెళ్లి తనకు వచ్చిన లెటర్ చూపించాడు. నాకు, నాకుటుంబానికి దుండగుల నుంచి అపాయం ఉందని దానికి సంబంధించిన వివరాలను సల్మాన్ తెలిపాడు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తనకు లైసెన్స్ ఉన్న గన్ను ఇవ్వాలని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సల్కర్ ను కోరాడు. దాంతో ఆయుధ చట్టం 2016 ప్రకారం ఎవరైన ఉన్నత వ్యక్తి తనకు ఇతరుల నుంచి ప్రాణా పాయం ఉందని వస్తే వారకి తగిన రక్షణ కల్పిస్తామని అందులో భాగంగానే.. అన్ని పత్రాలను చూసి సల్మాన్ కు తాజాగా గన్ లైసెన్స్ ఇచ్చాం అని కమిషనర్ వివేక్ తెలిపారు. మరి బాలీవుడ్ కండల వీరుడు గన్ లైసెన్స్ తీసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారధి కన్నుమూత! ఇదీ చదవండి: ఆమె చదువుల్లో సరస్వతి.. ఉన్నట్టుండి అంతలోనే ఇంత విషాదమా?