ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను.. వెన్నెల, ఇదే నా కథ అనే మాటలతో విరాటపర్వంలో సాగే సాయిపల్లవి పాత్ర చిత్రానికి హైలెట్ గా నిలిచింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయిపల్లవి-రానా జంటగా తెరకెక్కిన మూవీ విరాటపర్వం. జూన్ 17న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందే అంచనాలను తాకిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే టాలీవుడ్‌లో నక్సలిజం నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా చిత్రాలే వచ్చాయి. వాటిల్లో మావోయిస్టులు, రాజకీయ నాయకుల గురించి చెప్పారు. కానీ విరాటపర్వంలో మాత్రం నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించి దర్శకుడు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించారు. 1992లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుకు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కూాడా చదవండి: Naresh: మూడో భార్య రమ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు నరేష్ వరంగల్‌కు చెందిన మహిళ సరళ(సినిమాలో వెన్నెల అని పేరు మార్చారు)ను మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సంఘటనను కథగా తీసుకోని మంచి సంబాషణలతో అద్భుతంగా విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ టాక్ పరంగా బాగానే ఉన్న కలెక్షన్లపరంగా మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మూవీ ఓటీటీలోకి జూలై 1 నుంచి నెట్ ఫ్లెక్స్ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే స్పందించారు నటి సాయిపల్లవి విరాటపర్వం మూవీ షూటింగ్ సమయంలో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. విరాటపర్వంలోని వెన్నెల పాత్రలో నటించడం నా అదృష్టం. ఈ సినిమా చిత్రీకరణలో రోజులు నాకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఇలాంటి అద్భుతమైన పాత్రను నాకు అందించిన వేణు ఉడుగుల, రానా, చిత్రయూనిట్ కు ధన్యావాదాలు. ఈ మూవీ నెట్ ఫ్లెక్స్ స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి అంటూ సాయిపల్లవి పోస్ట్ చేసింది . సాయిపల్లవి పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)