RGV: తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ. శివ సినిమాతో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో సూపర్ హిట్ సినిమాలు తీసి.. బాలీవుడ్ లో మాఫియా తరహా సినిమాలు ఎక్కువగా తీశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో వర్మ తీసిన ‘సర్కార్’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు హిట్, ఫ్లాప్స్ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలకంటే వివాదాస్పద ప్రకటనలు, వ్యాఖ్యలతో ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు. వర్మ నుంచి వచ్చే సినిమాలతో పోలిస్తే అనౌన్స్ మెంట్స్ ఎక్కువైపోయాయి. వాస్తవాన్ని ప్రతిబింబించే మూవీలపై ఆయన ఫోకస్ పెట్టారు. సమకాలీన అంశానికి తనదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చి- వాటిని తెరకెక్కిస్తున్నారు. తాజాగా కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా 'కొండా' సినిమా తెరకెక్కించాడు. అయితే.. జూన్ 23న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వర్మ.. అమితాబ్ కొత్త సినిమా అనౌన్స్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. వర్మ మాట్లాడుతూ.. బాలీవుడ్ లో అమితాబ్ తో మంచి అనుబంధం ఉంది. ఆయనతో పలు హిట్ సినిమాలు తీశాను. త్వరలో అమితాబ్ బచ్చన్ తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఆ మూవీ హరర్ జోనర్ లో ఉండబోతుంది. బహుశా.. నవంబర్ లో స్టార్ట్ కావచ్చు'' అని వర్మ తెలిపాడు. ఈ ప్రకటన విన్న తర్వాత వర్మ అభిమానులు.. అమితాబ్ సినిమా మళ్ళీ వర్మను టాప్ లీగ్‌లోకి తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. మరి అమితాబ్ - వర్మ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.