మాస్ మహరాజా నుంచి వచ్చిన మరో హైఓల్టేజ్ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఓ పవర్ ఫుల్ ప్రభుత్వ అదికారిగా రవితేజ మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఇరగదీశాడు. చిత్తూరు ప్రాంతంలో మిస్టరీ కేసులుగా మిగిలిపోయిన కొన్ని హత్యలకు సంబంధించిన కేసుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ క్రమంలో రామారావుకు ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని ఎలా అధిగమించాడు, కేస్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేదే కథ. అయితే ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. మరి.. తొలిరోజు ఎలాంటి ఓపెనింగ్స్ లభించాయి? అసలు ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది అనే ప్రశ్న చాలా మందిలో మొదలైంది. ప్రాంతాల వారీగా అసలు రామారావు ఆన్ డ్యూటీ చిత్రం మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే కలెక్షన్స్(అంచనా): నైజాం - రూ.85 లక్షలు సీడెడ్ - రూ.52 లక్షలు ఉత్తరాంధ్ర - రూ.45 లక్షలు ఈస్ట్ - రూ.31 లక్షలు వెస్ట్ - రూ.16 లక్షలు గుంటూరు - రూ.24 లక్షలు కృష్ణా - రూ.17 లక్షలు నెల్లూరు - రూ.12 లక్షలు ఏపీ- తెలంగాణ టోటల్ - రూ.2.82 కోట్లు (రూ.4.75 కోట్లు గ్రాస్) వరల్డ్ వైడ్గా రామారావు ఆన్ డ్యూటీ రూ.5.95 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకి వరల్ట్ వైడ్గా రూ.17.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.18 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. శనివారం, ఆదివారం వచ్చే కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ సాధించడంలో కీలకం కానున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: బింబిసార ఈవెంట్లో అభిమాని మృతి.. కుటుంబానికి అండగా ఉంటామన్న చిత్ర బృందం! ఇదీ చదవండి: స్టార్ హీరో సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు దుర్మరణం