'రాధేశ్యామ్' తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ "ఆదిపురుష్". ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ జోడిగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ రావణుడి(లంకేశ్)గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర హీరో ఈ సినిమాలో కెమియో రోల్ చేస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. బాహుబలి సినిమాలు ఇచ్చిన ఊపుతో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. నార్త్ లో కూడా ప్రభాస్ కి ఫుల్ పాలోయింగ్ ఉంది. దీంతో నిర్మాతలు కూడా ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు వరుస కడుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన "సాహో" సినిమా 'టాలీవుడ్ లో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ లో ఇరగదీసింది. తర్వాత ప్రభాస్ "రాధే శ్యామ్" అనే సినిమాతో పలకరించారు ప్రస్తుతం "ఆదిపురుష్" తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రభాస్ సిద్ధమయ్యడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. అయితే తాజాగా సినిమాకు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కెమియో రోల్లో కనిపించనున్నారని టాక్. అది కూడా సీతా స్వయంవరంలో శివ ధనుర్భంగం తర్వాత రాముడిని సవాల్ చేసే పరశురాముడి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్ పాత్ర కాబట్టి ఈ రోల్‌ని ఎవరైనా స్టార్ హీరోతో చేయిస్తే బాగుటుందని అనుకున్నారు. ఫైనల్‌గా ఆ క్యారెక్టర్ చేసేందకు రామ్ చరణ్ అంగీకరించినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ముంబైలో విజయ్ క్రేజ్‌కు మతిపోవాల్సిందే.. బీ టౌన్ హీరోలకూ సాధ్యంకాని రేంజ్‌లో..! ఇదీ చదవండి: బ్రా కనబడితే తప్పేంటి? అలియా భట్ సంచలన వ్యాఖ్యలు!..