సినిమాల ప్రభావం సాధారణ జనం మీదే కాదు, ఆ సినిమాలు తీసే దర్శక, నిర్మాతల మీద కూడా ఉంటుంది. సినిమా ఆడితే వెల్ అండ్ గుడ్. ఆడకపోతే ఇక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా పూరీ జగన్నాథ్ కి ఇలాంటి పరిస్థితే వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన లైగర్ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూడడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని పూరీ జగన్నాథ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కోసం పూరీ ముంబైలోని ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పనుల కోసం ముంబైలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు పూరీ. ముంబైలోని సి ఫేసింగ్ లో 4 బిహెచ్ కే ఫ్లాట్ అద్దెకు తీసుకున్న పూరీ.. నెలకు 10 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారని, ఇతర ఖర్చులు కలుపుకుని సుమారు 15 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. లైగర్ సినిమా హిట్ అయితే పూరీ రేంజ్ మారిపోయేది. కానీ లైగర్ ఫ్లాప్ అవ్వడంతో పూరీకి భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో నెలకి 15 లక్షల రూపాయలు ముంబై ఫ్లాట్ కి అద్దెకు తగలేయడం ఎందుకని ఖాళీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో ముంబైలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. హిట్ అయి ఉంటే బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసుకునేవారేమో. అయితే సినిమా ప్లాప్ అవ్వడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. Rumours Suggest Director #PuriJagannadh Has Been Forced To Vacate His Posh Mumbai Sea-Facing Flat After #Liger Failed At The #BoxOffice@purijaganhttps://t.co/zqPfGmWWTb — Box Office Worldwide (@BOWorldwide) September 8, 2022 అయితే పూరీ విషయంలో ఫ్యాన్స్ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేదు అనుభవం పూరీకి కొత్తేమీ కాదని, గతంలో ఇంతకంటే ఘోరమైన పరాజయాన్ని చూశారని, ఒకరి చేతిలో మోసపోయి ఆల్మోస్ట్ రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, అలాంటి దుస్థితినే తట్టుకుని నిలబడ్డ పూరీకి ఇదొక లెక్కనా? మళ్ళీ ఏదో ఒక రోజు లేస్తారు. సాలిడ్ హిట్ తో పూరీ తన మార్క్ ని చూపిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూరీ ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేయడం మంచిదే, ఆ అరువు గాళ్ళకి డబ్బులెందుకు తగలేయడమని మరి కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి పూరీ ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్న సీరియల్ నటి.. పిల్లల విషయంలో ఆ కండీషన్ పెట్టిందట! ఇది కూడా చదవండి: Eesha Rebba: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్ ఈషా రెబ్బ.. ఆ డైరెక్టరే వరుడంట!