నిఖిల్ సిద్ధార్థ్.. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. డైలాగ్ డెలివరీ, నటనలో అతడి ఈజ్ చూసిన వారందరూ.. మరో రవితేజ అని ప్రశంసించారు. హ్యాపీడేస్ సినిమా విజయం తర్వాత నిఖిల్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే అవేవి అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఆ సమయంలో నిఖిల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో కార్తికేయ సినిమా అతడి కెరీర్‌ని మలుపు తప్పింది. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి.. మరి కొన్ని ఫ్లాప్‌లు చూశాడు. ప్రస్తుతం కార్తికేయ 2 చిత్రంతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. తెలుగులోనే కాక బాలీవుడ్లో కూడా సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పటికే నిర్మాతకు లాభాల పంట పండించింది. బాలీవుడ్లో పెద్ద సినిమాలు కార్తికేయ-2 ముందు తేలిపోయాయి. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో పైరసీ గురించి మాట్లాడుతూ.. నిఖిల్ భావోద్వేగానికి గురయిన వీడియో ఒకటి తాజాగా మరోసారి వైరలవుతోంది. కొన్ని వందల మంది ఎన్నో రోజులు, ఎంతో కష్టపడి.. కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా తీస్తే.. ఇలా పైరసీ చేయడం ఏంటని నిఖిల్ వాపోయాడు. సినిమా బాగుందనే టాక్ ఉన్నప్పుడు కూడా ఇలా జరగడం ఏంటని.. దీని వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతాయని చెప్పుకొచ్చాడు. నడి రోడ్డు మీద 40 రూపాయలకు తన సినిమా సీడీలను అమ్ముతున్నారంటూ నిఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మరోసారి వైరలవుతోంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం హీరో నిఖిల్, ఇతర చిత్ర బృందం గుంటూరులో సక్సెస్ మీట్ అనంతరం తిరిగి వెళ్తూ.. ఓ చోట టీ తాగడానికి ఆపారు. ఆ పక్కనే తోపుడు బండి మీద ఓ మహిళ వివిధ సినిమా సీడీలు అమ్ముతుంది. ఆశ్చర్యంగా అందులో నిఖిల్ లేటెస్ట్ సినిమా పైరసీ సీడీ కూడా ఉండటం గమనార్హం. ఇది చూసి నిఖిల్ ఆశ్చర్యపోయాడు. దీని గురించి సదరు మహిళను ప్రశ్నిస్తే.. తనకేం తెలియదు అన్నది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘కొన్ని వందల మంది ఎంతో కష్టపడి.. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమా తెరకెక్కుతుంది. అంతమంది శ్రమను పట్టించుకోకుండా.. మీరు ఇలా పైరసీ చేయడం.. దాన్ని సీడీల రూపంలో అమ్మకానికి పెట్టడం దారుణం’’ అంటూ వాపోయాడు. ‘‘ఇలా చేస్తే.. ఎన్నో వందల కుటుంబాలు రోడ్డున పడతాయని.. సినిమా గురించి మంచి టాక్ వస్తుంది.. దయచేసి.. ఎవరు పైరసీని ప్రోత్సాహించకుండా.. థియేటర్లోనే సినిమా చూడాలని’’ నిఖిల్ అభ్యర్థించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మరోసారి వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కార్తికేయ-2 ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం శ్రీకృష్ణుడా? ఇది కూడాచదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’లా హిందీలో విస్తరిస్తున్న ‘కార్తికేయ 2’.. 50తో మొదలై 1500 షోలకు!