సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఇన్‌ఫ్లూఎన్సర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 28 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కుస్తీకి దిగింది. రా చూసుకుందాం అంటూ విజయ్‌కి సవాలు విసిరింది. విజయ్ డైలాగు చెప్పబోతుంటే నా పిల్లలకు తండ్రి అవుతావంటూ ఆటపట్టించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- నిహారిక చేసిన ఆ రీల్ తెగ వైరల్ అవుతోంది. 1.6 మిలియన్ లైక్స్ కూడా దాటిపోయింది. అయితే ఎందుకు వీళ్లు కుస్తీ పడ్డారని కొందరికి డౌట్ రావచ్చు. నిహారిక రీల్స్ మాత్రమే కాకుండా కొన్నాళ్లుగా సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. యష్, మహేశ్ బాబుతో కలిసి రీల్స్ చేసి సౌత్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) కేజీఎఫ్, సర్కారు వారి పాట, రన్ వే 34, మేజర్ వంటి సినిమాలకు ప్రమోషన్స్ చేసింది. ఇప్పుడు లైగర్ టీమ్ నిహారికతో కలిసి ప్రమోషన్స్ చేశారు. అందులో భాగంగానే విజ్య్ దేవరకొండ- నిహారిక కలిసి ఓ ఫన్నీ రీల్ చేశారు. విజయ్‌ని ఫైట్‌కు ఛాలెంజ్ చేసి తన సిక్స్ ప్యాక్ చూసి నిహారిక తోక ముడుస్తుంది. View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) లైగర్ సినిమా విషయానికి వస్తే ఈ మూవీపై పూరీ- విజయ్- చార్మీ అంతా ఫుల్ కాన్ఫిడెన్స్ మీదున్నారు. అయితే నార్త్ లో మాత్రం ఈ సినిమాపై వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. కానీ, విజయ్ ఫ్యాన్స్ మాత్రం పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో విజయ్‌పై వచ్చే కామెంట్స్, ట్రోల్స్ కు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. విజయ్- నిహారిక రీల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) ఇదీ చదవండి: పుష్ప క్యారెక్టర్ యాటిట్యూడ్ కి పూరినే ఇన్స్పిరేషన్: సుకుమార్ ఇదీ చదవండి: లైగర్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లు పక్కా: సుకుమార్