చిత్ర పరిశ్రమలో నటీ నటులు రెండో వివాహం చేసుకోవడం సాధారణ విషయమే. అయితే రెండో పెళ్లి అయినా కానీ కొన్ని కుటుంబాల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన పిన తల్లి రాధిక విషయంలో చేసిన పనికి నెటిజన్స్ ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. వరలక్ష్మీ శరత్ కుమార్.. హీరో రవితేజా నటించిన 'క్రాక్' మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వరలక్ష్మీ ఏ విషయాన్నైనా డైరెక్టు గా చెబుతుందని అందుకే ఆమెని ఫైర్ బ్రాండ్ అంటారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే తాజాగా తన పిన తల్లి అయిన రాధిక 60వ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా వరలక్ష్మీ శుభాకాంక్షలు తెలిపింది. అందులో ఈ విధంగా రాసుకొచ్చింది. ''60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్ యూ.. మీరు మా అందరికీ ఆదర్శం. ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే దానికి మీరే ఉదాహరణ.. త్వరలోనే కలుద్దాం ఆంటీ లవ్ యూ.. ''అంటూ ట్యాగ్ చేసింది. ఇప్పుడు ఇదే వరలక్ష్మీ శరత్ కుమార్ కు పెద్ద తలనొప్పి తీసుకొచ్చింది. అమ్మను ఆంటీ అని పిలవడం ఏంటీ అంటూ నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తూన్నారు. దీనిపై గతంలోనే ఆమె స్పందించారు. రాధిక మా నాన్నకి రెండో భార్య మాత్రమే.. నిజానికి ఆమె నాకు తల్లి కాదు. అయినా గాని మేం చాలా సంతోషంగా ఉంటాం. అమ్మను ఆంటీ అని ఎందుకు పిలుస్తావ్ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. రాధిక నాకు అమ్మ కానప్పుడు ఏమని పిలవాలి? ఎవరికైనా తల్లి ఒక్కరే ఉంటారు. అందుకే ఆమె నాకు ఆంటీ అవుతుంది. అంటూ బదులిచ్చింది. ఇతరులే ఇలాంటి గాసిప్స్ పుట్టిస్తారని తెలిపింది. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. మరి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Happpyyyyyy 60th birthday aunty....loveeeee you...u r such an inspiration to us all...age is just a number and you are proof of that..muuahhh..have a good trip aunty..see u soon..muahhh 60 and fabulous.. @realradikaa pic.twitter.com/HaU3jBlxYL — (@varusarath5) August 21, 2022 Kadu @varusarath5 aunty yndi.?? Amma ani pettu. Baguntundi. Anta egoism Avasarama. Varu Bangaru — ALLU BALAJI (@Balaji66666) August 21, 2022 Ammava aunty nu solra ! ennachi ungalukku — Vijayakumar Arivalagan (@VijayakumarAri2) August 21, 2022 Why do you call her auntie? She is your mother... Call her that! Doesn't matter if she didn't get you into this world... She is in that place now... Not your birth mother — Venkat Subs (@manivisu73) August 22, 2022 ఇదీ చదవండి: బాలీవుడ్ స్టార్ హీరోల పరువు తీస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్! ఇదీ చదవండి: Chiranjeevi: మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సుమన్ టీవీ అధినేత సుమన్!