Laal Singh Chaddha Movie: ఆలిండియా సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా చేస్తున్నారంటే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఆయన నటించిన "లాల్ సింగ్ చడ్డా" సినిమాకి కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేక ప్రివ్యూని హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, నాగార్జున, సుకుమార్, నాగచైతన్య ఆమిర్ ఖాన్ తో కలిసి ఈ సినిమాని చూశారు. సినిమాని చూసిన మన వాళ్ళు ఆమిర్ ఖాన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ప్రివ్యూకి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజై నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఆమిర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. "నా ఇంట్లో ఎక్స్ క్లూజివ్ ప్రివ్యూ వేసినందుకు ధన్యవాదాలు ఆమిర్ ఖాన్" అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో రిలీజ్ చేస్తున్నట్లు మెగాస్టార్ వెల్లడించారు. "నా ప్రియ స్నేహితుడైన ఆమిర్ ఖాన్ అద్భుతమైన ఎమోషనల్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా' సినిమా తెలుగు వెర్షన్ ను సమర్పిస్తున్నందుకు గొప్పగా ఫీలవుతున్నాను. మా తెలుగు ప్రజలు ఖచ్చితంగా ఆమిర్ ఖాన్ ను ప్రేమిస్తారు" అంటూ ట్వీట్ చేసి మూవీ పోస్టర్ ను షేర్ చేశారు. దీంతో ఈ సినిమాపై తెలుగులో భారీ క్రేజ్ ఏర్పడింది. పోస్టర్ లో 'మెగాస్టార్ చిరంజీవి సమర్పించు' అనే పేరు చూసి మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమాను ప్రెజెంట్ చేయడానికి గల కారణాలను కూడా ఆయన ట్వీట్ చేశారు. "కొన్ని సంవత్సరాల క్రితం నా ప్రియ స్నేహితుడైన ఆమిర్ ఖాన్ ను.. జపాన్ లోని క్యోటో ఎయిర్ పోర్ట్ లో కలిసే అవకాశం చాలా మనోహరమైనది. అతనితో కాసేపు ముచ్చటించాను కూడా. ఆ సమయంలో ఆ అనుభూతి.. ఈరోజు నన్ను ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి 'లాల్ సింగ్ చడ్డా' సినిమాలో భాగస్వామిని చేసిందంటూ చిరు ట్వీట్ చేశారు. "అన్నిటికంటే ముఖ్యంగా, ఎలాంటి మెరుగైన సినిమాని మీరు చేశారు. ఇదొక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ" అంటూ ఆమిర్ ఖాన్ ను ఉద్దేశించి మరొక ట్వీట్ చేశారు. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ హీరో, హీరోయిన్లుగా.. నాగచైతన్య ప్రత్యేక పాత్రలో నటించిన "లాల్ సింగ్ చద్దా" ఆగస్ట్ 11న విడుదల కానుంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ "ఫారెస్ట్ గంప్" సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్థూడియోస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో పరిచయం కాబోతున్నారు. మరి మెగాస్టార్ ప్రెజెంట్ చేస్తున్న ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. Feel very privileged to present the Telugu version of my dear friend #AamirKhan ‘s wonderful emotional roller coaster #LaalSinghChaddha Our Telugu audiences are surely going to love him ! pic.twitter.com/Tb2apAaJrz — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022 Most of all, what a Gem of a film you have made!! Such a wonderful emotional journey!! @iamnagarjuna @ssrajamouli #aryasukku @chay_akkineni @AlwaysRamCharan — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022 ఇది కూడా చదవండి: Puneeth Rajkumar: పునీత్ ను అవమానించిన ట్విట్టర్.. ఫ్యాన్స్ ఆగ్రహం! ఇది కూడా చదవండి: Raghava Lawrence: రజినీకాంత్ కాళ్లు మొక్కి షూటింగ్ మొదలు పెట్టిన లారెన్స్!