మంచు మనోజ్.. టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని, ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్, భూమా మౌనికతో కలిసి హైదరాబాద్ నగరంలోని ఓ వినాయక మండపాన్ని సందర్శించుకున్నాడు. అక్కడ మంచు మనోజ్‌కు తన రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. మీరు మౌనిక రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి.. మీరేమంటారు అంటూ మీడియా ప్రశ్నించగా.. “అది పర్సనల్ మంచి సమయం వచ్చినప్పుడు చెప్తాను” అంటూ మంచు మనోజ్ స్పందించాడు. అయితే తాము పెళ్లి చేసుకోవడం లేదు అని మాత్రం ఖండించలేదు. సరైన సమయం చూసుకుని చెప్తానంటూ చెప్పడం వైరల్ గా మారింది. 2015లో మంచు మనోజ్- ప్రణతీ రెడ్డిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు వ్యక్తిగత కారణాలతో.. పరస్పర అంగీకారంతో 2019లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నుంచి మంచు మనోజ్ రెండో పెళ్లి అంటూ చాలాసార్లు వార్తలు చక్కర్లు కొట్టడం చూశాం. అయితే ఇప్పుడు భూమా మౌనికారెడ్డితో మంచు మనోజ్ గణేశ్ మండపాన్ని దర్శించుకోవడం అటు రాజకీయంగా, ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Verified: Manchu Manoj is going to getting married to Late Bhuma Nagi Reddy's daughter, Monika Reddy. They are spotted together when they visited a Ganesh Pandal in Sithaphalmandi this evening. pic.twitter.com/hSJHDAgCQ4 — MIRCHI9 (@Mirchi9) September 4, 2022