మంచు లక్ష్మి.. మోహన్ బాబు కుమార్తె అని కాకుండా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోనున్నట్లు హామీ ఇచ్చింది. ఇవన్నీ పక్కనబెడితే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే మంచు లక్ష్మీ సోమవారం ఉదయం ఎంతో బాధగా ఉందంటూ వీడియో చేసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియో రికార్డు చేస్తూ తనకు తెలియకుండానే ఏడ్చేసింది. తన కుమార్తె విద్యా నిర్వాణ విషయంలో మంచు లక్ష్మీ ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇదీ చదవండి: మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 ప్రభుత్వ పాఠశాలల దత్తత! అసలు అలా ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే.. “కరోనా వచ్చిన కొత్తలో లాక్ డౌన్ విధించారు. స్కూల్స్ లేవు.. 24 గంటలు పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోజంతా విద్యాని ఎలా భరించాలి అనుకుంటూ భయపడిపోయా. ఆ తర్వాత ఈ రెండేళ్ల కాలంలో మా మధ్య బాండింగ్ ఎంతో పెరిగింది. చాలా రోజుల తర్వాత తనని స్కూల్‌కి పంపి వస్తుంటే ఏదో తెలియని బాధ. ఇంత కష్టంగా ఉంటుందని అసలు అనుకోలేదు. త్వరలోనే దీనికి అలవాటు పడతాను అనుకుంటున్నా” అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ ఎమోషనల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #ManchuLakshmi Instagram story pic.twitter.com/nXTp1AXi2o — Hardin (@hardintessa143) July 25, 2022 ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్స్‌పై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్! ఇదీ చదవండి: ఆ సమయంలో నేను చనిపోదాం అనుకున్నా : సింగర్ కల్పన