ప్రస్తుతం తెలుగులోనే కాక.. బాలీవుడ్, నార్త్‌లో సైతం ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసిన సినిమా లైగర్. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరీ జగన్నాథ్-చార్మి కౌర్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్-అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటిస్తుండగా.. మైక్ టైసన్ కూడా నటించడం విశేషం. ఆగస్టు 25ఈ సీనిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో లైగర్ ప్రీ రిలీజ్ బిజినేస్ మీద జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క నైజాం ప్రాంతంలో పాతిక కోట్ల రూపాయలకి లైగర్ హక్కుల అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ ప్రాంతంలో 9 కోట్లు, వైజాగ్ ప్రాంతంలో 6కోట్లు, తూర్పు గోదావరి 5 కోట్లు, పశ్చిమ గోదావరి 3.5 కోట్లు, గుంటూరు 4.5 కోట్లు, కృష్ణ 4 కోట్లు, నెల్లూరు 2 కోట్లు కలిపి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక 5 కోట్లు, తమిళనాడు 2. 5 కోట్లు, కేరళ 1.5 కోట్లు బిజినెస్ జరగగా ఓవర్సీస్ లో 9 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఇక నార్త్ ఇండియాలో 12 కోట్ల రూపాయల బిజినెస్ జరగ్గా.. ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే.. లైగర్ 90 కోట్లకు పైగా వసూళ్లూ సాధింవచాలి. ఇక లైగర్ రౌడీ హీరో కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా నిలిచింది. ఇక లైగర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 థియేటర్లలో విడుదల కానుంది. నైజాం- 320 సీడెడ్- 190 ఏపీ- 420+ రెండు తెలుగు రాష్ట్రాల్లో- 930+ కర్ణాటక– 100+ తమిళనాడు-100+ కేరళ-100 హిందీ+నార్త్ ఇండియా-1000~ ఓవర్సీస్ – 700+ మొత్తం ప్రపంచవ్యాప్తంగా – 3000~ ఇది కూడా చదవండి: లైగర్ ఫ్లాప్ అయితే.. విలేకరి ప్రశ్నకు విజయ్ దేవరకొండ షాకింగ్ రిప్లై! ఇది కూడా చదవండి: 60 ఏళ్లు వచ్చినా.. ఆ 20 రోజులు మరిచిపోలేను: విజయ్ దేవరకొండ