సీనియర్ నటుడు కృష్ణంరాజు అనగానే.. ఆరడుగులు ఆజానుబాహుడి రూపమే గుర్తొస్తుంది. గంభీరమైన పాత్రలే ఎక్కువగా చేయడంతో రెబల్ స్టార్ అయిపోయారు. హీరో, విలన్, సహాయ పాత్రలు.. ఇలా ఏదైనా సరే తన మార్క్ చూపించారు. ఇవన్నీ పక్కనబెడితే కృష్ణంరాజు కుటుంబాన్న.. ఇండస్ట్రీలో ఆతిథ్యానికి మరోపేరుగా భావిస్తారు. ఫుడ్ పెట్టే విషయంలో అస్సలు మొహమాటపడరు. అలా టాలీవుడ్ 'మర్యాదరామన్న'గా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజుకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఇక వివరాల్లోకి వెళ్తే.. కృష్ణంరాజు మంచి భోజనప్రియుడు. కంచమంతా నాన్ వెజ్ ఐటెమ్స్ తో నిండిపోవాల్సిందే. కృష్ణంరాజు సెట్ లో ఉన్నారంటే ఆ రోజు అందరికీ విందు భోజనమే. ఎందుకంటే ఆయన కోసం ఇంటినుంచి క్యారేజీ వస్తుంది. ఇందులో పదిమందికి సరిపడా భోజనం ఉంటుంది. దీన్నే అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు. ఆయన నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ కి మరో ప్రత్యేకత ఉంది. ఆ బ్యానర్ లో సినిమా తీస్తున్నారంటే సెట్లో ప్రతి ఒక్కరికీ విందుభోజనాలే. షూటింగ్ టైమ్ లో కృష్ణంరాజు ఏం తింటే ఆ సినిమాకు పనిచేసిన లైట్ బాయ్ కూడా అది తినాలి. బాయ్ ని ఒకలా.. హీరోని ఒకలా చూడటం కృష్ణంరాజు డిక్షనరీలోనే ఉండేది కాదు. సరిగ్గా ఇదే అలవాటు కృష్ణంరాజుకి వచ్చింది. ఆతిథ్యంలో ఇంతలా మర్యాదలు చేసిన ఆయనకు పులస కూరంటే మహాఇష్టం. ఇక కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో వచ్చిన ప్రభాస్ కూడా ఆతిథ్యం విషయంలో ఏ మాత్రం తగ్గడు. తనతో పనిచేసిన ఏ నటుడైనా సరే ప్రభాస్ గురించి చెబుతూ.. 'ఫుడ్ పెట్టి చంపేస్తారండీ బాబు' అని సరదాగా అంటూ ఉంటారు. మరి కృష్ణంరాజు ఫ్యామిలీ ఆతిథ్యం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: మరణం విషయంలో కృష్ణంరాజు కోరిక ఇదే.. అలా కన్నుమూయాలనుకున్నారు! ఇదీ చదవండి: వారసత్వంగా కృష్ణంరాజుకు కోట్ల ఆస్తులు.. దానితో పాటు ఇన్నేళ్లలో ఇదీ చదవండి: రెబల్ కృష్ణంరాజు జీవితంలో మీకు తెలియని విశేషాలు