Konidela Pavan Tej: ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాతో వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు కొణిదెల పవన్ తేజ్. ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ మేఘన హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. తర్వాత కూడా ఇద్దరూ టచ్‌లో ఉన్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. తాజాగా, పవన్ తేజ్, మేఘనల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, హీరో సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పవన్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ 10-08-2022న ఎంగేజ్‌మెంట్ జరిగింది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను.. ఇది అన్నింటికి ఆరంభం. నాకు ప్రేమంటే ఏంటో తెలిసిందంటే.. అందుకు కారణం నువ్వే’’ అని పేర్కొన్నాడు. మరో పోస్టులో కొణిదెల సురేఖను ఉద్ధేశిస్తూ.. ‘‘ థాంక్యూ చిన్నమ్మ. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మలిచారు. నా చిన్నప్పటి నుంచి చిరంజీవి బాబాయ్ దీవెనలు, మద్దతు సరిలేనివి’’ అని పేర్కొన్నాడు. ఇక, పవన్ తేజ్, మేఘనల జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానుంది. మరి, పవన్ తేజ్, మేఘనల ఎంగేజ్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Pavan Tej Konidela (@pavantej_konidela) View this post on Instagram A post shared by Pavan Tej Konidela (@pavantej_konidela) View this post on Instagram A post shared by Megganna (@m_y_megganna) ఇవి కూడా చదవండి : Hyper Aadi: వీడియో: స్టేజిపై కంటతడి పెట్టుకున్న హైపర్ ఆది.. కారణం?